అజాత శత్రువు ఆగ్రహిస్తే...

అజాత శత్రువు ఆగ్రహిస్తే... - Sakshi


ఆలోచనం

భారతంలో ధర్మరాజుకు కలిగిన ధర్మాగ్రహమే నంద్యాల సభలో ప్రతిపక్షనేతకు వచ్చి ఉంటుంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను డబ్బుల వాసన చూపించి తన గుంజకు కట్టేసుకున్న బాబు అల్ప వ్యక్తిత్వాన్ని చూసి జగన్‌కు ఆగ్రహం కలిగి ఉంటుంది.



వైఎస్‌. రాజశేఖరరెడ్డి మరణానంతర కాలంలో ఒక నెల్లూరు నాయకుడు ‘‘జగన్‌ని ఉరివేయాలి’’ అని అన్నాడు ఒక సందర్భంలో.  నెల్లూరు వాసిని కనుక వైఎస్సార్‌ తన హయాంలో అత  నికి ఎంత మంచి భవిష్యత్తు ఇచ్చారో చూసిన దానిని కనుక, ఆయన చేసిన ఆ వ్యాఖ్య నన్ను  దిగ్భ్రమకు గురి చేసింది. మనుషుల మీద, మానవత్వం మీద నాకప్పుడు చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కూడా ఆ మాట గుర్తుకు వస్తే నాకు ఒకలాంటి దిగులు కలుగుతుంది. వైఎస్‌ జగన్‌ మీద పలువురు పలురకాలుగా వాక్‌ పారుష్యాన్ని ప్రదర్శిం చారు. తనను దూషించిన వారిని తిరిగి తిట్టడం జగన్‌కి చేతనవుతుంది కదా. కానీ, జగన్‌ ఒక్కటంటే ఒక్కసారి కూడా ఎవరినైనా తిరిగి పరుషంగా మాట్లాడటం, సంస్కా రపు హద్దులు దాటటం నేను చూడలేదు.



అధికారంలోని పార్టీ, ఆయా వ్యక్తులు గతంలో ఏ నాయకుడిపైనా చేయనంత స్థాయిలో జగన్‌ పై పెద్ద ఎత్తున మాటల దాడి చేసున్నారు. ఇక్కడ నాకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. మొదటిది అనితర సాధ్య మైన ఆయన నాయకత్వ లక్షణం. తరువాత ‘మాటలను  అదు పులో పెట్టుకుని ఇతరుల మతాన్ని గౌరవించడం ద్వారా తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి’ అని తన ధమ్మం  ప్రకటించిన అశోకుని తరహా కార్యాచ రణ, పట్టుదల, సత్వర నిర్ణయాలు తీసుకోగల చురుకు దనం, చొరవ, దగ్గరికి వెళ్లాలనిపించే ఆత్మీయత. ఎన్టీఆర్, వైఎస్సార్‌ తరువాత ‘‘ఎవ్వని చారిత్రమెల్ల లోకములకు నొజ్జయై’’ నిలుస్తుందో అని భారతంలో చెప్పినట్లు, ఆంధ్ర దేశ చరిత్రలో గొప్పగా నిలువగల వ్యక్తిత్వం ఉన్న ‘‘ధీరో దాత్త నాయకుడు’’ జగన్‌. తన వ్యక్తిత్వానికి సంబంధించిన ఈ లక్షణాలను పాలక పక్షాలు, వారి కొమ్ముకాస్తున్న పత్రి కలూ, చివరికి గమనగమ్య స్పష్టత లేని పవన్‌ కల్యాణ్‌ లాంటి చిన్న స్థాయి నాయకులతో సహా, అందరూ గుర్తు పట్టారు. అందుకే జగన్‌ అనే ఒక్క వ్యక్తిపై వారందరూ గుంపుగా కూడి యుద్ధం చేస్తున్నారు.



‘‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు ఏకము కాకపోవు ఈ కర్ణులు పదివేవురైన చత్తురు రాజరాజ నా పలుకులు ఆలకింపుము’’ అంటాడు రాయబారం కోసం వెళ్లిన కృష్ణుడు. గట్టిగా ఎవరినీ ఒక మాట అనని శాంత మూర్తి ధర్మరాజుకి కోపం వస్తే సముద్రాలన్నీ పొంగి ఏక మౌతాయట. బహుశా నంద్యాల సభలో ప్రతిపక్ష నేతకు అలాంటి కోపమే వచ్చి ఉంటుంది. ద్రౌపదిని మోసపు జూదంలో గెలిచారనీ, ఆమె ‘అన్యాయ విజిత’ అన్నాడు వికర్ణుడు. వారిని వీరిని వూతం చేసుకుని అబద్ధపు వాగ్దా నాలిచ్చి చావుతప్పి గెలిచిన బాబు గెలుపు కూడా అన్యాయ విజితమే. అది చాలక జగన్‌ జనాకర్షణను వాడుకుని ఎమ్మె ల్యేలుగా గెలిచిన వాళ్లని, డబ్బుల వాసన చూపించి తన పార్టీ గుంజకు కట్టేసుకున్న బాబు అల్ప వ్యక్తిత్వాన్ని చూసి చూసి జగన్‌కు ఆగ్రహం కలిగి ఉంటుంది. భీముడు కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి క్రుద్ధుడై లేచి దుర్యోధనుడి తొడలు యుద్ధ రంగంలో తన గదతో పగల కొట్టి తీరుతానని, అతని వక్షస్థలాన్ని చీల్చి రక్తాన్ని తాగుతా నని అంటాడు. అడ్డూ ఆపూ లేకుండా బాబు చేస్తున్న అన్యాయాల్ని చూశాక జగన్‌కి కూడా భీమ కోపం వచ్చి ఉంటుంది. ఆ ఆగ్రహం వెనుక న్యాయం ఉందని నమ్మి, దానిపేరు ‘‘ధర్మాగ్రహం’’ అని గౌరవిస్తున్నది తరతరా లుగా ఈ మానవ సమాజం.



తమిళ సాహిత్యంలో గొప్ప ఇతిహాసం శిలప్పది కారం. ఇతిహాస నాయిక కణ్ణగి. తన భర్తను అన్యాయంగా దొంగ అని నిందవేసి చంపిన రాజు పట్టణాన్ని మంటలు రేపి బూడిద చేస్తుంది కణ్ణగి. మహాభారతంలో ‘‘రక్కేస తాల్మితో, చిచ్చోడినగట్టినట్లు’’ అవమానాన్ని మోసుకు తిరుగుతున్నానని చెప్పిన ద్రౌపదితో ‘‘కౌరవుల భార్యల ఏడుపు చూసి నీవు కల కల నవ్వే రోజులు దగ్గరున్నాయ్‌’’ అంటాడు కృష్ణుడు. ‘నీవుండే హైద్రాబాదు, దాని పడమట గోలుకొండ, గోలుకొండ ఖిల్లా కింద, నీ ఘోరీ కడతం కొడుకో, నైజాం సర్కరోడా’ అని నైజాం సర్కారుని హెచ్చ రించారు ప్రజలు, వారి కోపం పేరు కూడా ధర్మాగ్రహమే.



‘అన్యాయమే చట్టమైనప్పుడు, తిరుగుబాటే విద్యుక్త ధర్మం అవుతుంది’ అన్నాడు థామస్‌ జెఫర్సన్‌. యుద్ధం చేయాలా వద్దా అని తర్కించుకుంటున్న ధర్మరాజును వెళ్లి కాషాయం కట్టుకో అంటుంది ద్రౌపది. రావాల్సినపుడు కోపం రావాలి. కవి ఎన్‌.గోపి అన్నట్లు ‘కోపాన్ని ప్రదర్శిం చలేనివాడు, లోకాన్ని మార్చలేడు’. అలా నంద్యాలలో జగన్‌కి వచ్చిన కోపం రావాల్సిన సమయంలో వచ్చిన ధర్మాగ్రహం. ధర్మాగ్రహం ఎప్పుడూ విజయాన్నే సాధిం చింది. ఎవరెన్ని మాట్లాడినా, ఎంత అడ్డుపడినా ధర్మా గ్రహం గెలిచే తీరిందని చరిత్ర చెబుతుంది. చరిత్ర, మోసంతో రాజ్యం కోల్పోయి కష్టించి గెలిచిన నల మహా రాజుని, ధర్మంకోసం కాటి కాపరి అయిన సత్యహరిశ్చం ద్రుడిని, అన్యాయానికి ఓర్చి గెలిచిన పాండవులను, అర ణ్యవాసానికోర్చి రామ రాజ్యాన్ని స్థాపించిన రాముడిని దేవుళ్లను చేసింది. ప్రజలు వారు కష్టాలకు  ఓర్చిన విధానం చూసి కథలకు నాయకులను చేసి కీర్తించి పూజిస్తున్నారు. వెయ్యి అబద్ధాలతో రాజ్యాలేలిన వాళ్లు కాలగర్భంలో కొట్టుకు పోయారు.

ప్రజాస్వామ్యమైనా ఇది ప్రచ్ఛన్న రణరంగం. ఈ రణ స్థలిలో నిలిచి తన పక్షపు ప్రజల ఆకాంక్షలకు నాయకత్వం వహిస్తున్న జగన్, బాబుపై చేసిన వ్యాఖ్య చాలా చిన్నది. బాబు చేస్తున్న అన్యాయాలకు జగన్‌ అదే స్థాయిలో జవా బులే ఇస్తే ఇంతకంటే పెద్ద పెద్ద మాటలే వినాల్సి వస్తుంది.



సామాన్య కిరణ్‌

వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 

91635 69966

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top