ప్రత్యేక హోదాకు సడలని ‘దీక్ష’

ప్రత్యేక హోదాకు సడలని ‘దీక్ష’ - Sakshi


రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్ నేడు గుంటూరులో దీక్ష చేయనున్నారు. బలప్రయోగంతో ప్రజా పోరాటాలను అణచివేయడం భ్రమేనని, ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ప్రజలు ఒక కొత్త సందేశాన్ని ఇవ్వబోతున్నారు.

 

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి విభజన తరవాత రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోరుతూ ఒక ప్రతిపక్ష నేతగా సమరశీలమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నిక లలో రాష్ట్ర ప్రజలకు చంద్ర బాబు ఇచ్చిన హామీలు అమ లుపరచాలని ఒకవైపు నిన దిస్తూ పోరాటాలు కొనసాగిస్తూనే, విభజన చట్టంలోని 7 జిల్లాలకు (రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3) ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుగా పోలవరంకు సహకారం కోసం ఆయన నడుంబిగిం చారు.

 

 ఆయన జరుపుతున్న ఆందోళనలో భాగంగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ ఢిల్లీలో దీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బాధ్యులకు 13 జిల్లాల సమగ్రాభి వృద్ధి గురించి విన్నవించారు. దీక్షల కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యేకించి చంద్రబాబుపైనా, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేందుకు గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను గత నెల 26న చేపట్టేందుకు నిర్ణయించారు. ఆ దీక్షను అడ్డుకోవడంకోసం అడుగడు గునా అసభ్యకరమైన పదజాలంతో వైఎస్సార్‌సీపీ మీద నిందారోపణలు చేయడమే కాకుండా, చివరకు సభను జరగనివ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుపడ్డారు.

 

 ఈ పరిణామం రాష్ట్రంలో ప్రజాస్వామిక ప్రక్రి యను అపహాస్యంచేసి, ప్రతిపక్ష వాణిని ప్రజలకు వినిపించనివ్వకుండా అడ్డగించడానికి పన్నిన కుటిల ప్రయత్నం. పైగా ఆత్మహత్యలు చేసుకుంటామంటే మేము అనుమతి ఇవ్వాలా.. అంటూ స్వయాన ముఖ్య మంత్రే అవహేళన చేస్తూ ప్రతిపక్ష నేతపైన దిగజారుడు ప్రకటనలు చేయడం కుసంస్కారం. చంద్రబాబును సంక్లిష్ట సంక్షోభ సమయాలలో ఆదుకుంటున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు వెళ్లిన వారే. అలనాటి జనసంఘ్ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి, సిక్కిం మాజీ గవర్నర్ రామారావు, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి తదితరులతో కలసి ఆయన జైలులో సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు చేశారు. ఆ సందర్భంగా వెంకయ్యనాయుడు గారితో కలసి ఆ దీక్షల్లో పాల్గొన్న అనుభవం ఈ రచయితకు ఉన్నది. చంద్రబాబు హద్దులు మీరకుండా చూసుకో వల్సిన బాధ్యతను ఆయన మరవరాదు.

 

 విభజన సందర్భంగా రాష్ట్రానికి 10 సంవత్సరాల వరకు ప్రత్యేక హోదా కావాలని ఆనాటి రాజ్యసభలో వెంకయ్యనాయుడు డిమాండ్ చేసి నాటి ప్రధాని మన్మో హన్‌సింగ్‌ను కూడా ఒప్పించారు. రాజధాని పోగొట్టు కోవడం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ ఒక తల లేని మొండం లాగా కాంతి హీనంగా ఉన్నది. పోలవరానికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం... రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ.350 కోట్లు మాత్రమే కేటాయిం చడం... రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నియ మించిన శివరామకృష్ణన్ నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ఏకపక్షంగా బుట్టదాఖలు చేసి, పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి బలవంతాన సేకరించి రాజధాని నిర్మాణం చేపట్టడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వీటిని సవరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగ స్వామి అయిన బీజేపీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిం చడం లేదు. పట్టిసీమ రాజధాని కోసం చేపట్టిందే కాని రాయలసీమకు సంబంధం లేదు. ఈ అంశం పట్ల కూడా వెంకయ్యనాయుడు బాధ్యతతో స్పందించడంలేదు.

 

 మరొక ఆసక్తికరమైన అంశం చంద్రబాబు నాయుడు మరియు ప్రధాని మోదీని ప్రభావితం చేసే కార్పొరేట్ దిగ్గజాలు ప్రత్యేక హోదా సౌకర్యాలు రాజ ధాని ప్రాంత అభివృద్ధి జోన్‌లోనే అమలు జరిగేటట్లు ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు కూడా ఢిల్లీలో ప్రధానిని కలిసినప్పుడు రాజధాని అభివృద్ధి ప్రాంతంలోనే ప్రత్యేక ప్యాకేజీ తరహా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞాపన చేయడం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకహోదా ఒక హక్కుగా ఆమోదం పొందితే ఉత్తరాంధ్ర, రాయల సీమకు బ్రహ్మాండమైన పారిశ్రామిక ప్రోత్సాహకాలు రావడం వల్ల ఆ ప్రాంతాలలో నిరుదోగ్య సమస్య పరిష్కారం కాగలదు. కాని చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలలో భాగంగా రాజధాని ప్రాంతాలలోనే తనకు నచ్చిన పారిశ్రామికవేత్తల అంటే సింగపూర్ కార్పొరేట్ సంస్థలు ఆయనకు సన్నిహితంగా ఉన్న కార్పొరేట్ శక్తుల ఒత్తిడులకు తలొగ్గి ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్నారు.

 

 ఈ నేపథ్యంలోనే 13 జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం జగన్ దీక్ష చేస్తున్నారు. ఎంతో రాజకీయ చరిత్ర కలిగి స్వాతంత్య్ర పోరాటంలో తనకంటూ ఒక సుస్థిరస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న గుంటూరులో నేడు ఆయన దీక్ష జరపడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోం ది. తిరుపతి, విశాఖపట్నం సభలకు ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికి యువకులు, విద్యార్థులు ప్రత్యేక హోదా విషయంలో జగన్‌కు బాసటగా నిలిచారు. విద్యా ర్థుల స్పందనలు చూసి బెంబేలెత్తిన చంద్రబాబు విద్యా లయాలలో కఠిన ఆంక్షలను ప్రవేశపెడుతున్నారు. పోలీ సులను ఉపయోగించి ప్రజా పోరాటాలను అణచివేస్తా మనుకోవడం ఎంతటి భ్రమో గుంటూరు సభను విజ యవంతం చేయడం ద్వారా రాష్ట్రానికి ప్రజలు ఒక కొత్త సందేశాన్ని ఇవ్వబోతున్నారు.  ప్రజల పట్ల బాధ్యతతో స్పందించే రాజకీయ పార్టీకి దీటుగా స్పందించి, ఆ పార్టీతో భుజం భుజం కలిపి పోరాడటానికి ప్రజలు సంసిద్ధంగా ముందుకు రావడం వైఎస్సార్ పార్టీకి నూతనోత్సాహం కల్పిస్తుంద నడంలో ఎటువంటి సందేహం లేదు.

 వ్యాసకర్త కదలిక సంపాదకులు: 99899 04389

 - ఇమామ్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top