ప్రజాగ్రహానికి కారకులెవరు?

ప్రజాగ్రహానికి కారకులెవరు?


ఒక మంత్రి కోసం ముగ్గురు ప్రయాణికులను విమానం నుంచి కిందికి దింపేయటం, ఒక సీఎం కోసం అంతర్జాతీయ విమానాన్ని ఆపివుంచడం (ఆ సీఎం కార్యదర్శి తన వీసా పత్రాలను వెంట తీసుకురావడం మర్చి పోయారు), ఎంపీల జీతభత్యాల పెంపుపై పార్లమెంటరీ కమిటీ సూచన చేయడం వంటి ఘటనలు వరుసగా జరిగాయి. పై ఘటనల కొనసాగింపుగా సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అవతలి కారులో ప్రయా ణిస్తున్న కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలిక మరణిం చగా దాంట్లోని కొంతమంది గాయపడ్డారు. ఘటన జరగ్గానే హేమమాలిని షాక్‌కు గురయ్యారని తెలుస్తోం ది. బహుశా ఆమె దిగ్భ్రాంతి చెంది, ప్రమాదంలో గాయ పడిన వారికి సహాయం చేయాలని నిర్ణయించుకోలేక పోయి ఉండవచ్చు. బీజేపీ కార్యకర్తలు తమ విధేయత ప్రకటించుకోవడంలో భాగంగా వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఉండవచ్చు.



అయితే ఈ ఘటనలో ఇతర బాధితులు తమకు తక్షణం వైద్య సౌకర్యం కల్పించేవారు కనబడక సందిగ్ధ స్థితిలో ఉండిపోయారు. ఈ పరిస్థితిలో ఒక వైపరీత్యం, అసమానత ఉన్నాయి.  అత్యున్నత స్థానాల్లో ఉన్నవారిపై సామాన్యులు ఎందుకు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారన్నే విష యాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఈ విభజనలో ‘వారు’..  ‘మనము’ అనే వ్యత్యాసం ఉంది. ఇక్కడ డబ్బు కాకుం డా ఇతర విషయాలు ప్రాధాన్యం వహిస్తుంటాయి. ఎంపీలకు మల్లే, ప్రజల ఎరుకలో హేమమాలిని కూడా ‘వారిలో’ భాగమే మరి.



కార్యాలయాల్లో తాము నిర్వహించే కర్తవ్యాలను నెరవేర్చడానికి ఈ విలువైన వ్యక్తులకు ఇలాంటి సౌకర్యా లు అత్యవసరం అని మనం భావిస్తూనే, సామాన్యు లను వారిలా ఇబ్బంది పెట్టడానికి కారణాలు కూడా ఉన్నాయని గుర్తించాలి. అది వారి డాంబికం. వీరి దృష్టిలో ఇతరులు లెక్కలోకి రారు. ఇతర పౌరులు వీరి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి సంబంధించి కేవలం యాధృచ్చికమైన వ్యక్తులు మాత్రమే.  



ప్రభుత్వాల భారీ బడ్జెట్‌లతో పోలిస్తే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతరులు పొందుతున్న సౌక ర్యాలు చాలా చిన్నవి మాత్రమే. పైగా సామాన్యుడు వీరికయ్యే వ్యయం గురించి పెద్దగా బాధపడటం లేదు. కానీ వాటిని వారు తమ హక్కుగా భావిస్తుండటాన్నే వారు ఇష్టపడటం లేదు. వారి డాంబికమూ, రాజకీయా ల్లో సత్వరం ఆర్జించిన వారి వ్యక్తిగత సంపదను వారే మాత్రం ఇష్టపడటం లేదు. ప్రజాప్రతినిధులను చెడుమా ర్గాల్లో సంపాదించినవారిగా వారు అనుమానిస్తున్నారు.



ఇక ఎంపీలకు వేతనాలు, భత్యాలను పెంచాలన్న సూచన కూడా ప్రముఖ వ్యక్తుల అవసరానికి సంబంధిం చినది కాదు. పార్లమెంట్ క్యాంటీన్‌లో వారు చెల్లించే అతి తక్కువ ధరలలోని అసంబద్ధతను ఇది పట్టి చూపు తుంది. ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులు తమ సబ్సి డీని వదులుకోవాలని ప్రభుత్వం కోరుతున్న ఘటనపై ఒక టీవీ ప్రకటన వ్యాఖ్యానిస్తూ ఇది వంట గ్యాస్ లేనివారికి లబ్ధి చేకూరుస్తుందని సూచిస్తుంటుంది. ఇది గాయంపై మరోసారి కత్తిని పెట్టి తిప్పడమే అవుతుంది. ఇది బలిసిన పిల్లులకు, బక్క పిల్లులకు మధ్య ఉన్న విభజనను సూచించే ఆర్థిక వివక్షతకు సంబంధించిన అర్థాన్ని ధ్వనిస్తుంది.



గత కొన్ని సంవత్సరాలుగా గృహ బడ్జెట్‌లను తీవ్ర ద్రవ్యోల్బణం దెబ్బతీస్తున్నప్పటికీ, మన శాసన  నిర్మాత లు సరుకుల ధరలను నియంత్రించడంలో సహాయం చేయలేకపోవడాన్ని చూసినట్లయితే.. ఈ తర్కం మరిన్ని విషయాలకూ వర్తిస్తుంది. వంట గ్యాస్‌కు పూర్తి ధర చెల్లించగలిగిన వారు కూడా సబ్సిడీలను ఎందుకు కోరు కుంటున్నారు? దుఃఖితులకు వ్యతిరేకంగా వాదించడం దారుణం. పైగా, తమకు తాము కల్పించుకున్న ప్రయో జనాలనుంచి లబ్ధి పొందుతున్న  వారు వాటిని వదులు కోలేరు. ఇది అంతమయ్యేలా కనిపించడం లేదు కూడా.



అత్యధిక ప్రయోజనాల జాబితాను రూపొందించిన ఎంపీలు  తమ పార్లమెంటరీ పనిని మరింత అర్థవంతం గా చేసే పనుల కు ఎందుకు మద్దతు కోరటం లేదు? వారికి ప్రస్తుతం కల్పించిన వ్యక్తిగత సహాయకులకు బదులుగా, తగిన పరిశోధక బృందం కోసం వారెందుకు అడగటంలేదు? పరిశోధక బృందం ఉంటే సమాచారాన్ని సమర్థవంతంగా అందుకున్న ఎంపీలుగా వారు చక్కటి డేటాబేస్‌ను కలిగి ఉంటారు. బహుశా పార్లమెంటులో ముందు బెంచీల్లో కూచున్న వారు తప్ప మిగిలిన ఎంపీ లలో చాలామంది తమ పని పార్టీ విప్‌లపై ఆధారపడి ఓటువేయడానికే పరిమితమని భావిస్తుండవచ్చు.



స్థానిక అభివృద్ధి నిధిని ఉపయోగించుకునే హక్కు ను కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను తాము స్థానిక అంశాలకే పరిమితం చేసుకుంటున్నారు. ఒకసారి ఇలా వారి పాత్రను నిర్వచించడం, నిర్ధారించడం జరిగాక, సమాచార డేటాబేస్‌కు వారిని దూరం చేసి, వారి నియో జకవర్గాలకే పరిమితం చేస్తుంది. ఎంపీఎల్‌ఏడీ లేదా ఎంఎల్‌ఏఎల్‌ఏడీ నిధులు ఒక సందేశాన్నిస్తున్నాయి. మీ పని ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మీది నామమాత్ర మైన పాత్ర మాత్రమే.



ఎంపీలు తమ పనితీరుని మెరుగుపర్చుకోవడం కోసం తగిన సహాయాన్ని కోరుకోవడం లేదన్న వాస్తవం పార్లమెంట్ లేదా రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ప్రయోజనా నికే హాని తలపెడుతోంది. పైగా తమ పాత్ర ఎంతో తక్కువ అని కూడా వారు భావిస్తున్నట్లు ఇది సూచిస్తోం ది. తమ ఆలోచనా తీరును మళ్లీ అంచనా వేసుకోవలసిన అవసరమున్న ఎంపీలతో సహా ఎవ్వరికీ ఇది మేలు చేకూర్చదు. ఎన్నికైన పదవుల్లో ఉన్న రాజకీయనేతలు తమపై వస్తున్న విమర్శను అలా సుతారంగా దులుపుకుని యథావిధిగా తమ తమ పనుల్లో మునిగిపోవడం చాలా తప్పు.


(వ్యాసకర్త మహేష్ విజా పుష్కర్, సీనియర్ పాత్రికేయులు)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top