కన్నీటి జ్ఞాపకాల చిత్తడిలో వైఎస్

కన్నీటి జ్ఞాపకాల చిత్తడిలో వైఎస్ - Sakshi


సందర్భం

 'మాది పేద బ్రాహ్మణ కుటుంబం. ఇల్లు గడవడ మే కష్టం అనుకుంటే ఇంకో పెద్ద కష్టం వచ్చిపడింది. మా చిన్నమ్మాయికి మూత్ర పిండాల వ్యాధి అని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీతో మా అమ్మాయి బతికి బట్ట కట్టింది...' నిన్న సాక్షిలో నేను రాసిన వ్యాసం చదివి వరంగల్ నుంచి వచ్చిన ఫోను ఇది. ఆయన మరో విషయం కూడా చెప్పాడు. 'మా అబ్బాయి ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ చదువు చదివించడం నావల్ల అయ్యేపని కాదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పుణ్యం అది.'




 'మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చేయాలన్నా రు. గుండె జారిపోయింది. ఆరోగ్యశ్రీ కింద ఆపరే షన్ జరిగింది. ఏడేళ్లు హాయిగా బతికారు. తరువాత ప్రోస్టేట్ ఆపరేషన్ అంటే అమ్మ నగలు కుదువబెట్టి చేయించాం. అరవై వేలు అయింది. అయినా మనిషి మాకు కాకుండాపోయారు. ఆయన బతికున్నన్నాళ్లు అంటుండేవారు. నన్ను బతికించారు. ఏం లాభం ఆయనే పోయారని' అంటూ మహబూబ్‌నగర్ నుంచి మరో ఫోను. ఆదిలాబాద్ నుంచి, సత్యవేడు నుం చి ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల నుంచి ఫోన్లు వచ్చాయి. వాళ్లెవరికీ రాజకీయాలతో సంబం ధంలేదు. దాదాపు అందరూ ఆరోగ్యశ్రీ పథకం వల్ల మంచి ప్రయోజనం పొందిన వాళ్లే. లాభాలు కార్పొ రేట్ ఆసుపత్రులు  పొందాయని వచ్చిన ఆరోపణ ల్లో నిజానిజాలు ఏమైనప్పటికీ ప్రయోజనం పొం దిన పేద ప్రజలు కూడా చాలా మంది ఉన్నారన్న వాస్తవాన్ని ఈ స్పందన తెలియజేసింది.




 కొన్ని అక్షింతలు కూడా పడ్డాయి. ఈ పథకం ప్రారంభం వెనక మా హస్తం సైతం ఉందని కొందరు ఫోన్లు చేసారు. వారిలో మంద కృష్ణమాదిగ ఒకరు. ఒకప్పుడు వికలాంగుల కోసం, గుండె జబ్బులతో బాధపడే చిన్నారుల కోసం వీధి పోరా టాలు చేసిన వ్యక్తి ఆయన. వైఎస్ సీఎంగా ఉన్న ప్పుడు ఆ అంశాలపై రాజీలేని ఆందోళనలు నిర్వహించిన మంద కృష్ణమాదిగ పేరు ఈ సందర్భంలో మరచిపోవడం నా పొరపాటే. కానీ, ఒక నాయకుడి వర్ధంతి సందర్భంగా సంస్మరణ వ్యాసం రాసేటప్పు డు కొన్ని పరిమితులు, పరిధులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే ఇలాంటి అపార్థాలు రావు.




 ఉజ్వల అనే ఆవిడ ఫోన్ చేసారు. ఆరోగ్యశ్రీ పథకం గురించి రాసేటప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డి గురించి ఎందుకు ప్రస్తావించలేదు అన్నది ఆవిడ అభ్యంతరం. వాస్తవానికి ఆమె ప్రస్తావించింది ఆ రోజుల్లో సీఎం పేషీలో ఆరోగ్యశ్రీ వ్యవహారాలు పర్య వేక్షించిన కిరణ్ కుమార్‌రెడ్డి గారి గురించి. ఆయన స్వయానా ఉజ్వల సోదరుడు కావడంవల్ల ఆరోగ్య శ్రీ పథకం రూపకల్పనలో ఆయన పడ్డ శ్రమదమా దులు వారికి తెలిసి ఉంటాయి. అయితే ఈ వ్యాసం ప్రధానంగా ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి తేవడంలో రాజశేఖరరెడ్డి గారిని ఏ అంశాలు ప్రభావితం చేశా యి అన్నదాన్ని గురించి మాత్రమే.




 ఇక్కడ గమనించాల్సింది ఈ పథకం ఎవర్నో బాగుచేయడానికని, ప్రైవేటు ఆసుపత్రులకు దోచి పెట్టడానికని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నిజమే.. ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేస్తే, అవి బాగా పనిచేస్తే ఈ పథకం అవసరమే వచ్చేది కాదు. అమ్మా పెట్టదు...తిననివ్వదు అనే సామెత చందం గా కాకుండా సామాన్యులు కూడా కార్పొరేట్ ఆసు పత్రుల గడప తొక్కగలిగే విధంగా కొందరి ప్రాణా లు ఆరోగ్యశ్రీ వల్ల, 108 అంబులెన్స్ సర్వీసుల వల్ల నిలబడ్డ మాట వాస్తవ దూరం కాదు. ప్రజలకు మంచి చేసే కొన్ని విషయాలను రాజకీయ కోణం నుంచి వేరు చేసి చూడాలి.




ఒక సందర్భం కోసం 'సాక్షి' లో నేను నిన్న రాసిన ఒక వ్యాసం ఇంత స్పందన తెస్తుందని అను కోలేదు. బహుశా దీనికి ప్రధాన కారణం నేను రాసింది వైఎస్ గురించి కావడం, ప్రచురించింది మంచి పాఠకాదరణ ఉన్న పత్రిక కావడం కావచ్చు.



బండారు శ్రీనివాసరావు

-వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, 98491 30595

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top