‘ఓటుకు నోట్లు’లో ‘బలిదానాలు’

స్టీఫెన్సన్,మత్తయ్య - Sakshi


పేద, బడుగువర్గాలు, దళిత బహుజన, మైనారిటీలు ఈ పరిణామాల్ని శ్రద్ధగా గమనించాలి.

‘మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి’ అనీ ‘చైతన్యం పొందండి, చైతన్యం పొందండి,

చైతన్యం పొందండీ’ అనీ మూడేసిమార్లు అంబేడ్కర్ ఎందుకు ఆదేశించవలసి వచ్చిందో ఆలోచించవలసిన అవసరం ఉంది.

‘వైస్రాయి హోటల్’ తరహా మోసాల నుంచీ, ‘ఫామ్‌హౌస్’ కుట్రల నుంచీ దళిత ప్రతినిధులూ, మైనారిటీ, బహుజన వర్గాల ప్రతినిధులూ బయటపడాలి.


 

రెండోమాట

‘ఓటుకు-నోట్లులో’ కుంభకోణాన్ని ఛేదించడంలో అవినీతివ్యతిరేక సాధి కార బృందం (ఏసీబీ) ఒకవైపున ముందుకు సాగుతున్నప్పటికీ, అవినీతి కేసు లలో శిక్షలుపడిన వారి శాతం మాత్రం ఘోరం! గడచిన మూడేళ్లలోనే ‘ఏసీబీ’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 344 కేసులు నమోదు చేసింది. అంతే-కథ కం చికి వెళ్లింది, ఏసీబీ ఇంటికి చేరింది’.    -టైమ్స్ ఆఫ్ ఇండియా (18-6-2015)

 

‘ఓటుకు-నోట్లు’ తాజా కేసులు కూడా ఉభయ రాష్ట్రాల ప్రజల ప్రయోజ నాలకన్నా ఇద్దరు ప్రధాన నేతల, వారి రాజకీయపక్షాల స్వార్థ ప్రయోజనాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. విభజనానంతరం తమ అధికారం స్థిరపడ్డానికి పాలకపక్షాలు చేస్తున్న వ్యూహరచనలో బలి పశువులు అవుతున్నది- బడుగు బలహీనవర్గాల వారేనన్నది సత్యం! ఈ కేసులోని నిందితులు నలుగురిలో ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లు, ఇద్దరు దళిత క్రిస్టియన్‌లు. వీరిలో ఒక సాక్షిని ఒక రాష్ట్ర నేత తన పంచన చేర్చుకోగా, మరొక సాక్షిని మరొక నేత తన పంచను చేర్చుకున్నాడు! ఆ గుట్టుమట్టుల చాటున పెద్దలు తలలు దాచుకుంటున్నారు.



ఈ రోజు దాకా కేసులకు సంబంధించిన ‘అతిరహస్యం’ ప్రజలకు ‘చెవి పోటు’గా మారింది! కానీ అవినీతి రాజకీయాల నిర్వహణలో ఆరితేరిన ఈ నేతల మధ్య కేంద్ర ప్రభుత్వ ‘పెద్దల’ జోక్యంతోనో లేదా మధ్యవర్తిత్వంతోనో రాజీ కుదిరినా కుదరవచ్చు. పదవుల రక్షణార్థం ఈ పరిణామం చోటు చేసు కోవచ్చునని కొన్ని పత్రికలూ, కొందరు నాయకులూ ఇప్పటికే ప్రకటించారు.

 

ఎటూ తేలకుండా (రెండు రాష్ట్రాల నేతల మధ్య)సాగుతున్న ఈ అధికార స్థాయి అంతర్నాటకంలో- ఇలాంటి వ్యవహారాలలో వాస్తవాలను వెలికి తీయడానికి తోడ్పడవలసిన ఫోరెన్సిక్ లేబొరేటరీలో కూడా ప్రభుత్వాలు పెట్టే కేసుల్లో ఎలాంటి ప్రయోగాలకు అవకాశం ఉంటుందో షాజహాన్‌పూర్ (యూపీ)లో జరిగిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు జాగేంద్రసింగ్ హత్యతో వెల్ల డైంది. మంత్రి రామమూర్తి వర్మ ఇందుకు కారకుడని జాగేంద్రసింగ్ మరణ వాంగ్మూలంలో చెప్పాడు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు సమర్పించిన ఫోరె న్సిక్ నివేదిక వర్మను నిర్దోషిగా ప్రకటించడానికి సాహసించింది!



ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంగన్‌వాడి కార్మికురాలు కూడా పోలీసులే జర్నలిస్టును కాల్చి చంపారని చెప్పింది. కానీ జర్నలిస్టే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసు కున్నాడని పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టును సిద్ధం చేశారు! జర్నలిస్టు కుటుం బానికి ‘న్యాయం’ చేస్తాననీ, రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లిస్తాననీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించిన 24 గంటల్లోనే వేరే కథకు కాళ్లువచ్చాయి!

 

‘ఓటుకు నోట్లు’ కేసులో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిత్ర మైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది! ఈ కేసు వివరా లను (ఆడియో, వీడియోలు, టేపులూ, పోలీసుల నివేదిక, కోర్టుకు సమర్పిం చిన అభియోగాల తబిసీళ్లు వగైరా) తనకు వెంటనే అందజేయాలనీ, ఎన్నికల సందర్భంగా జరిగే అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారణ బాధ్యత తన పరిధిలోకి వస్తుందనీ ఎన్నికల కమిషన్ జూన్ 1వ తేదీన ప్రకటించింది. కానీ ఆ విషయం ‘ది హిందూ’ వెల్లడించేదాకా ఇతర మీడియా మభ్యపెట్టడం విశేషం! ఎప్పటికప్పుడు ‘కీలక సాక్ష్యం’ దొరికిందని చెప్పడమే కాని, అదెంత ‘కీలక’మో తెలుసుకుందామన్న ఆసక్తితో ఉన్న ప్రజలకు మాత్రం అది అంద డం లేదు.



ఎన్నికల కమిషన్ జూన్ 1వ తేదీన ఏసీబీని ఆదేశించిన లేఖను స్థానిక పాలకులు నిర్లక్ష్యం చేసినందుననే 24 రోజుల తర్వాత (జూన్ 25న) మరోసారి రిమైండర్ (జ్ఞాపకం) ఇవ్వవలసి రావటం కేసులు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయో తెలుస్తోంది. అంతేగాదు, అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి హార్డ్‌డిస్క్, ఇతర కీలక సాంకేతిక పరికరాలు కూడా తమకు ట్రాన్స్‌క్రెబింగ్‌కు విధిగా అవసరమనీ ఫోరెన్సిక్ అధికారులు కోరగా, ‘ఆ బాదరబందీ మీకెందుకు, ఆ పనిని మేమే చూస్తాంలెండి’ అని ఏసీబీ సమాధానమిచ్చినట్టు కూడా ‘ది హిందూ’ సూచనప్రాయంగా వెల్లడించింది.

 

అటూ ఇటూ కక్కుర్తే


లోకంలో దొరికినవాడు ‘దొంగ’, దొరకనివాడు ‘దొర’! ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ఒక ప్రాంతంలోని అధికారపక్షం నేతలు ‘ఓటుకు నోట్ల’తో కక్కుర్తిప డ్డారు. నిజమే. ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన’ వేసుకున్నట్టుగా మరో రాష్ట్రం శాసనసభలో 63 మంది సభ్యులే ఉన్నప్పటికీ, మండలిలో ఐదు సీట్ల కోసం అక్కడి అధికారపక్షం చూపించిన కక్కుర్తి ఎలాంటిది? 63 సంఖ్యను 85కి దేకించాలి కాబట్టి, అవసరమైన 22 మంది ప్రతిపక్షాల (కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ వగైరా) సభ్యులకు ఎరవేయడం అందుకే.



అంటే అధికారం నిలబెట్టుకోవడానికి ఏ సంపన్న వర్గ రాజకీయ పక్షమూ సిగ్గూ, లజ్జాభిమా నాలను త్యాగం చేయడానికి వెరవదని మరొకసారి ప్రజల అనుభవంలోకి వచ్చింది! చివరికి - ఏ పార్టీ గుర్తుతో ఎన్నికైనారో ఆ పార్టీల ‘బకెట్’ను కాస్తా తన్నేసి, అధికారపక్షంలో భాగమవుతున్నవారి గుర్తింపును రద్దు చేయాల్సిన లెజిస్లేచర్ సభాపతులు కూడా నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు.



విచార ణాధికారులు అభియోగాలు మోపిన తరువాత, నిందితుల్ని అరెస్టు చేయవ లసి వస్తే ముందు ప్రాథమిక నివేదిక ఆధారంగా కోర్టు అనుమతిని విధిగా పొందవలసిన కనీస ఆనవాయితీని కూడా విచారణ సంస్థలు పాటించక పోవడం ఏ సంప్రదాయం కింద, ఏ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద, ఏ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ఏ ఎన్నికల కమిషన్ నిబంధనల కింద నమోదైందో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు.

 

బడుగులూ బహుపరాక్!

 పేద, బడుగువర్గాలు, దళిత బహుజన, మైనారిటీలు ఈ పరిణామాల్ని శ్రద్ధ గా గమనించాలి. కేవలం ధనస్వామ్య ప్రయోజనాలను కాపాడుతున్న శాసన వేదికల్లో ప్రవేశించాలన్న ఆబతో, ఆ చక్రబంధంలో చిక్కుబడిపోకుండా చైత న్యంతో ఉండవలసిన అవసరం గతంలోకన్నా నేడు ఎక్కువగా ఉందని గ్రహించాలి! ‘ఓటుకు నోటు’ లాంటి అవినీతికర ప్రయోగాలకు ‘ఎర’గాకుం డా జాగ్రత్తపడాలి. స్టీఫెన్‌సన్, సెబాస్టియన్, జెరూసలెం మత్తయ్య లాంటి వారు ఇరు రాష్ట్రాల పాలకశక్తుల కుట్రలకు బలవుతున్న తీరుతెన్నులు ఇతరు లకూ గుణపాఠం కావాలి!



నేటికీ ‘నాలుగు పడగల హైందవ నాగరాజులు’ ఏలుతున్న స్వతంత్ర భారతంలో రానున్న పరిణామాల్ని ముందుగానే పసి కట్టగలిగిన మహాకవి జాషువా ధనిక వర్గ వ్యవస్థలో దళిత, మైనారిటీ బహు జన వర్గాలు ఎలా వ్యవహరించాలో హెచ్చరించాడు:

 ‘‘ఏ నాడు మా జాతి (దళిత బహుజనులు) దృష్టి మాంద్యము బాసి

     చుట్టు ప్రక్కల తేరిపార చూడగలదొ /

 ఏనాడు మా బుర్రలీ జుట్టు తలలేని

     పుక్కిటి కథలలో చిక్కువడదొ/

 ఏనాడు మా విద్యలు ఇనుప సంఘమునందు

     చిలుముపట్టక ప్రకాశింపగలవొ’’

ఆనాడు, అదిగో ఆనాడు మాత్రమే శ్రమైకజీవనం మీద ఆధారపడే బహుజనులందరికీ నిజమైన విమోచన దినం. ఆ లక్ష్యసాధనే డాక్టర్ అంబే డ్కర్‌కు ఆచరణాత్మకమైన, నిజమైన నివాళి. ‘మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి’ అనీ ‘చైతన్యం పొందండి, చైతన్యం పొందండి, చైతన్యం పొం దండి’ అనీ మూడేసిమార్లు అంబేడ్కర్ ఎందుకు ఆదేశించవలసి వచ్చిందో ఆలోచించవలసిన అవసరం ఉంది. ‘వైస్రాయి హోటల్’ తరహా మోసాల నుంచీ, ‘ఫామ్‌హౌస్’ కుట్రల నుంచీ దళిత ప్రతినిధులూ, మైనారిటీ, బహు జన వర్గాల ప్రతినిధులూ బయటపడాలి.

(వ్యాసకర్త మొబైల్: 9848318414)

ఏబీకే ప్రసాద్,

సీనియర్ సంపాదకులు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top