వైద్య విలువలు పట్టవా?

వైద్య విలువలు పట్టవా? - Sakshi


విశ్లేషణ

సిఫారసులు చేసేవారికి కమిషన్లు ఇవ్వడం, పుచ్చుకోవడం అనే తప్పుడు పద్ధతులు కొందరికే పరిమితం అనుకున్నా... అది ఐఎంఏ ఎదుర్కొనవలసి ఉన్న సమస్యే



ముంబైలోని ఓ సుప్రసిద్ధ సింగిల్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఇటీవల తమ ఆవర ణకు దగ్గరగా ఒక భారీ ప్రకటనను పెట్టింది. ‘‘నిజాయి తీతో కూడిన అభి ప్రాయం. కమీషన్లు లేని డాక్టర్లు’’ అన్న ఆసియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి ఆ ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. వెంటనే వైద్య వృత్తి నిపుణులంతా నిలువునా చీలిపోయారు. ఆ ప్రకటనను తొలగించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కోరింది.



ఫలానా చోట చూపించుకోవాలని రోగులకు సూచించిన జనరల్‌ ఫిజీషియన్‌కు ఆసు పత్రీ, డాక్టర్లకు వైద్య పరీక్షలు చేసే లేబొరేటరీ కమీషన్లు చెల్లిస్తాయనేది ఎప్పటి నుంచో అంద రికీ తెలిసిన బహిరంగ రహస్యం. కాకపోతే ఆ  ప్రకటన ఆ విషయాన్ని కూడా బయట పెట్టింది. నగదు రహిత బీమా ఉన్న రోగులకు హెచ్చించి వేసే బిల్లులను లెక్కలోకి తీసు కోకున్నా, వైద్య సదుపాయాలు మహా ఖరీ దైనవిగా మారడానికి ఈ కమీషన్లు ఒక కారణం.



ఆ ప్రకటనను తొలగించకపోతే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఏ)కు లేదా మహా రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని ఐఎంఏ, ఆసియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రాసింది. ఆ ఆసుపత్రి అందుకు నిరాకరించడమేగాక, తమ ప్రకటనకు వైద్య వృత్తి నిపుణుల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభిస్తున్నట్టు చెప్పు కుంది. మహారాష్ట్ర కౌన్సిల్‌కు, రాష్ట్ర ఆరోగ్య మంత్రికి ఒక లేఖను రాస్తూ ఆ ఆసుపత్రి... ఈ ఫీజు వాటాల పంపకం పద్ధతి (కట్‌ ప్రాక్టీస్‌) కారణంగా ఒక డాక్టర్‌ లేదా ఆసుపత్రి నిజా యితీగా తమ వృత్తిని నిర్వహించడం కష్టంగా మారుతోందని తెలిపింది.



ఈ చర్చలలో రెండు పక్షాలున్నాయన్నది స్పష్టమే. ఒక పక్షం చేసే వాదన... వైద్య వృత్తి, విలువలతో కూడిన ఉన్నత ప్రమాణాలకు ప్రాముఖ్యాన్నిస్తూ నిస్వార్థంగానైనా వైద్య సహా యాన్ని అందిస్తుందని వైద్యులు చేసే ప్రమా ణాన్ని పాటించాలనడంతో సమానం. ఇక మరో పక్షం వాదన,.. వైద్య వృత్తిలోని ఎవరో కొందరు ఎక్కడో చేసే తప్పుడు పనులను ఆ ప్రకటన అతిశయీకరిస్తోందని, తద్వారా మొత్తంగా వైద్య వృత్తిపట్ల ఉండే సదభిప్రాయానికి, దాని ప్రతిష్టకు మచ్చను తెస్తోంది అని.  



మీడియా కథనాలను, టాక్లింగ్‌ కరప్షన్‌ ఇన్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అనే శీర్షికతో  ‘ద లాన్‌ సెట్‌’ వైద్య పత్రిక 2013లో ప్రచురించిన వ్యాసాన్ని, కథలు కథలుగా చెప్పుకునే ఆధా రాలను బట్టి చూస్తే ఈ రెండు పక్షాల నడుమ మధ్యే మార్గం కనపడటం కష్టం. ఈ చర్చను రేకెత్తించినందుకు ఆ ఆసుపత్రికి ధన్యవాదాలు తెలపాల్సింది పోయి, అది మహా తెలివిగా తమ ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు.



ఆ ప్రకటన అతిగా సాధారణీకరించినదనీ, ఈ కమీషన్ల వ్యవహారంలో అందరు డాక్టర్లు, అన్ని ఆసుపత్రుల ప్రమేయం లేదనీ, ఈ తప్పుడు పద్ధతులు కేవలం కొందరికే పరిమి తమనీ అనుకుందాం. అయినా వైద్య వృత్తిలో విలువలకు హామీని కల్పించడం కోసం ఇది ఐఎంఏ ఎదుర్కొనవలసిన సవాలే అవుతుంది. అందుకు బదులుగా ఐఎంఏ అనవసర రాద్ధాం తం చేస్తోంది. ‘‘ఆ ప్రకటన చెప్పేది ఒక డాక్టర్‌ చేసే ప్రాథమికమైన పనే. ఇది, మేం డబ్బును దోచుకోం అని బ్యాంకులు ప్రకటించుకోవడం వంటిది’’ అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ రవి వాంఖేడ్కర్‌ ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో అన్న ట్టుగా... ఆ సంస్థ అసలా తప్పుడు పద్ధతులే జరగడం లేదన్నట్టు  నటించలేదు.



ఔషధాల తయారీదారులు వైద్య వృత్తి నిపుణులకు ఇచ్చే ప్రోత్సాహకాలను గురించి, వైద్య ఉపకరణాల ధరలను అధికంగా నిర్ణయిం చడం, చివరికి లైసెన్స్‌ లేకుండా ఎముకలు, కీళ్లకు సంబంధించిన ఉపకరణాలను తయారు చేయడం వరకు ఇటీవల చాలా మీడియా కథ నాలు వెలువడ్డాయి. ప్రైవేటువే కాదు, ట్రస్టులు నడుపుతున్న ఆసుపత్రులు కూడా అధిక ధర లను వసూలు చేస్తుండటాన్ని మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ బట్టబయలు చేస్తూనే ఉంది.




కమీషన్ల పద్ధతిని కాలం చెల్లినదిగా చేసేలా, అధికంగా పెంచిన బిల్లులతో రోగులు తీవ్ర కష్టాలకు గురికాకుండా చూసేలా, ప్రైవేటు రంగ వైద్యంపై ప్రజలు ఉంచుతున్న నమ్మకం ఆవిరైపోకుండా చూసేలా వైద్య వృత్తిలో ఉన్న వారు తమ పద్ధతులను మెరుగుపరచు కోవా లనైనా కనీసం ఐఎంఏ, ఎమ్‌సీఐలు కలసి చెప్పాల్సి ఉంది.




వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మహేష్‌ విజాపృకర్‌

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top