గ్రహం అనుగ్రహం, భవిష్యం

గ్రహం అనుగ్రహం, భవిష్యం - Sakshi


గ్రహం అనుగ్రహం

శ్రీ హేవిళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపదమాసం, తిథి శు.నవమి తె.4.30 వరకు (తెల్లవారితే గురువారం)

తదుపరి దశమి, నక్షత్రం జ్యేష్ఠ రా.2.14 వరకు, తదుపరి మూల

వర్జ్యం ఉ.5.54 నుంచి 7.40 వరకు, దుర్ముహూర్తం ఉ.11.36 నుంచి 12.25 వరకు, అమృతఘడియలు సా.4.30 నుంచి 6.15 వరకు.

సూర్యోదయం           :  5.48

సూర్యాస్తమయం      :  6.16



రాహుకాలం :  

ప 12.00 నుంచి

1.30 వరకు

యమగండం :

ఉ.7.30 నుంచి

9.00 వరకు



భవిష్యం

మేషం: ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ధనవ్యయం. ముఖ్య నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.



వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. వ్యవహా రాలలో విజయం. వ్యాపారాలు ఊపందు కుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.



మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.



కర్కాటకం: ఎంతమ పడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.



సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో అకారణ వైరం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.



కన్య: అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.



తుల: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.



వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సా హంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.



ధనుస్సు: ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.



మకరం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.



కుంభం: చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొం టారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపా రాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.



మీనం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయా ణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యయ ప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

– సింహంభట్ల సుబ్బారావు


నమాజ్‌ వేళలు

నమాజ్‌ వేళలు

ఫజర్‌    :    4.48

జొహర్‌    :    12.17

అసర్‌    :    4.43

మగ్రీబ్‌    :    6.31

ఇషా    :    7.45

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top