పాటల తాతయ్య సుద్దాల


పాటకు నిలయం.. పోరాటానికి చిహ్నం

 పల్లెటూరి పిలగాడా - పసులగాసే మొనగాడా

 ఆడుతూ పాడుతూ అలసి సొలసిన

 శ్రమజీవులకు ఉయ్యాలవై

 వెయ్ వెయ్ వేయర దెబ్బ దెబ్బకు దెబ్బ

 అంటూ దోపిడిపై నిప్పులు చె రిగి

 రజాకార్ల దౌర్జన్యాలను పల్లె పొలిమేరదాకా

 తరిమి తరిమి కొట్టిన ధైర్యశాలివి

 సుద్దాల హనుమంతు పాటల సవ్వడై

 మళ్లీ మళ్లీ తొలి పొద్దు పొడుపై

 తిరిగొస్తాడని.. మళ్లొస్తాడని

 తెలంగాణ పల్లె ఎదురు చూస్తోంది

 తల్లడిల్లుతున్న పోరాట తల్లులు

 ఆగమైన అడవితల్లి.. మూగబోయిన రాగాలు

 మళ్లీ మళ్లీ పాటల మోతలై

 పోరాటాలను పురిగొల్పుతాయి.

 (నేడు ప్రజాకవి, గాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు

 సుద్దాల హనుమంతు 34వ వర్ధంతి)

 దామరపల్లి నర్సింహారెడ్డి: 9581358696

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top