థాంక్యూ పోలీస్...


ఓ ఇంటికి విచారణ కోసం వెళ్లిన కానిస్టేబుల్‌కు ప్రతిఫలంగా డబ్బులి వ్వబోతే ప్రభుత్వం తనకు జీతమిస్తుండగా నాకెందుకు నజరానా అం టూ దరఖాస్తుదారు ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన పోలీస్ కానిస్టేబుల్ నారాయణరావుకు చేతులెత్తి సెల్యూట్ చేయాల్సిందే. లం చం లేనిదే ఎఫ్‌ఐఆర్ కూడా రాయడానికి వీలులేని పోలీసుశాఖలో తనకు వచ్చే జీతం చాలని ప్రకటించిన ఈ నిజాయితీ పరుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించి అభినందించడంతో యావత్ పోలీసు శాఖను గౌరవించినట్లయింది. ఈ సాధారణ పోలీసు ప్రవర్తనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ప్రభుత్వోద్యోగి కూడా నజరా నాలు తీసుకోకుండా జీతభత్యాలతోనే పని చేయగలిగినప్పుడు తెలం గాణ రాష్ట్రం కొత్త ఉద్యోగ సంస్కృతిని నెలకొల్పినట్లే అవుతుంది. ఇదే సమయంలో పోలీసుశాఖలో ఏళ్ల తరబడి ఒకే పనిలో ఉంటున్న వారి నిజాయితీని, సీనియారిటీని గుర్తించి వారికి పదోన్నతులు కల్పించాలి.


 


అలాగే ఉద్యోగులు, ప్రత్యేకించి తాహసిల్దార్ల పనివిధానం వల్లనే బం గారు తెలంగాణ సాధ్యమౌతుందని సీఎం గతంలోనే సెలవిచ్చారు. తమకూ, సంబంధిత విభాగానికి మచ్చ తేకుండా పనిచేయడం ద్వారా నే ఉద్యోగులు నూతన రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కాగలరు. చివ రిగా నిజాయితీని పుణికిపుచ్చుకున్న కిందిస్థాయి ఉద్యోగులను ప్రభు త్వం గుర్తించాలి. అదే సమాజానికి అసలైన రక్షరేకగా ఉంటుంది.

- అమన్ రాజీవ్  బెల్లంపల్లి


 




 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top