రాజకీయవేత్తల ‘వ్యాపార పోటు’

రాజకీయవేత్తల ‘వ్యాపార పోటు’ - Sakshi


బాబు ఎప్పుడూ వ్యాపారవేత్తల మధ్యనే ఉంటున్నారు. అది తప్పేమీకాదు గానీ ఆయన వారికి బందీగా ఉన్నారు. బాబు ఈ నూతన సంపన్నులకు దూరంగా ఉండి ఉంటే ఇప్పుడీ ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇరుక్కుని ఉండేవారూ కారు.

 

 రాజకీయవేత్తలకు సర్వసా ధారణంగా సోకే ప్రమాదకర మైన వ్యాధి ‘వ్యాపార పోటు’. గుండెపోటు లేదా లివర్ దెబ్బ తినిపోవడం వంటి వాటికి భిన్నంగా ఇది దురాశ, అవి నీతి వల్ల సంక్రమిస్తుంది. తెలి విగా తమ సంపదలను దాచే సుకుని గాంధేయవాదుల్లా నటించగలిగిన కొందరు రాజకీయవేత్తలకు ఈ వ్యాధి సోకదు. దొరికిపోయేవారు వెర్రిబాగులవారే. ఇంగ్లండ్, అమెరికాలాంటి దేశాల రాజకీయవేత్తలకు వ్యాపార పోటు భయం తక్కువ. ఎందుకంటే అక్కడి ప్రజలు అవి నీతికంటే అనైతిక ప్రవర్తననే ఎక్కువగా పట్టించుకుం టారు. ఆ విషయంలోనే వారు దొరికిపోతుంటారు. కాగా మన రాజకీయవేత్తలు డబ్బుకు సంబంధించిన కుంభకోణాల్లో దొరకడం పరిపాటి.

 

 రాజకీయవేత్తలకు తాము ఎంతెంత డబ్బు తినిపిం చామో గొప్పలు చెప్పుకోవడం మన వ్యాపారవేత్తలకు అలవాటు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా అరుణ్ నెహ్రూ ఆయనకు సలహాదారు. విదేశీ వ్యాపారవేత్తలైతే ఇక్కడివారిలా గప్పాలు కొట్టక గమ్మున ఉంటారు, వారి నుంచి ముడుపులు పుచ్చుకుంటే దొరకమని సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటించే రాజీవ్ బోఫోర్స్ కుంభ కోణంలో దొరికిపోయి, 1989లో ఓడిపోయారు.  జయ లలిత గత రెండు దశాబ్దాలుగా అలా బాధపడుతూనే ఉన్నారు. ములాయంసింగ్ ఆ వ్యాధి బారినపడ్డా తెలి విగా స్వస్థత పొందగలిగారు. ఇక మమతా బెనర్జీ సైతం వ్యాపార పోటుకు గురికాబోతున్నారు. కరుణానిధి, కని మొళి, రాజాల నుంచి మాయావతి వరకు అంతా ‘వ్యాపార పోటు’తో విలవిలలాడుతున్నవారే. చూడ బోతే, సోనియా, రాహుల్ , ప్రియాంకల తలరాతే కాస్త బావున్నట్టుంది. అయితే రాబర్ట్ వాద్రా ఇటీవలే రియల్ ఎస్టే టర్ల ద్వారా ‘వ్యాపార పోటు’కు గురయ్యారు. గత మూడు వారాలుగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు ‘వ్యాపార పోటు’తో బాధపడుతున్నారు. తక్షణమే రాజకీయ ఐసీ యూకి తరలించకపోతే వారి కేరీర్లు ముగిసిపోతాయి. బీజేపీలో ఎవరూ కాపాడేలా లేరు. మహారాణి రాజే మీడియా కంటపడకుండా గోడ దూకి దొడ్డిదోవ పట్టా ల్సివచ్చింది. సుష్మా వారికి దొరక్కుండా దాక్కున్నారు.

 

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇప్పుడు ‘వ్యాపార పోటు’ బాధితుల జాబితాకు ఎక్కారు. ఆయ న ఎప్పుడూ వ్యాపారవేత్తల మధ్యనే ఉంటున్నారు. అం దులో తప్పేమీ లేదు గానీ ఆయన వారికి బందీగా ఉన్నా రు. వ్యాపారవేత్తలతో సమస్యేమిటంటే వారికి రాజకీ యాలు ఒకపట్టాన అర్థం కావు. బాబు ఈ నూతన సంప న్నులకు దూరంగా ఉండి ఉంటే ఆయన ఇప్పుడీ ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇరుక్కుని ఉండేవారూ కారు, ఆయన ప్రతిష్ట మట్టి పాలయ్యేదీ కాదు. ములా యంసింగ్‌కు అమర్‌సింగ్‌లా చంద్రబాబును చాలా మం ది తెలుగు అమర్‌సింగ్‌లు చుట్టిముట్టి ఉన్నారు. వారా యనకు శత్రువులను తయారు చేసిపెట్టే పనిలోనూ, ఆయన ప్రభుత్వాన్ని ముంచేసే పనిలోనూ ఉన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోని కొన్ని మౌలిక సూత్రాలను మరచారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభు త్వానికి మధ్యన వారధులుగా నిలుస్తారు. కానీ బడా వ్యాపారవేత్తలు మాత్రం డబ్బు ఖర్చు పెట్టి గెలిచాం, గెలిచాం కాబట్టి డబ్బు ఖర్చు పెడతాం, మళ్లీ డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తామని భావిస్తారు. అమర్‌సింగ్  సమాజ్‌వాదీ పార్టీని ఎలా నాశనం చే శారో చంద్రబాబు కాస్త ములాయంను అడిగి తెలుసుకుంటే మంచిది.

 

 ధైర్యం చేసి ఆయన అమర్‌సింగ్‌ను బహిష్కరించినా, రెండేళ్లపాటూ బ్లాక్‌మెయిల్‌కు గురవుతూనే వచ్చారు. చంద్రబాబు చుట్టూ అమర్‌సింగ్‌లు కనబడుతుండటం తెలుగు ప్రజలకు ఆగ్రహం కలుగజేస్తోంది. వ్యాపారవేత్త లకు సన్నిహితంగా మెలిగితే వారెలా నాశనం చేసేస్తారో ‘లలిత్‌గేట్’ కుంభకోణం ద్వారా వసుంధర, సుష్మాలకు అనుభవంలోకి వచ్చింది. వసుంధర ముఖ్యమంత్రిగా ఉండగా అన్నీ లలిత్ మోదీయే నిర్దేశించారు, శాసిం చారు. ఆమె ఓడిపోయిన వెంటనే ఆమెకు దూరమయ్యా రు. ఆమె తిరిగి ముఖ్యమంత్రి కావడంతో ఆగ్రహం చెం ది, ఆమెను నాశనం చేయడానికి పూనుకున్నారు. రాజకీ యవేత్తలు వ్యాపారవేత్తలను చేరదీయగలరేగానీ వారిని దూరంగా పెట్టలేరు. వారిని బహిష్కరించారంటే చాలు... అజ్ఞాత వ్యక్తులుగా సీబీఐ, ఇన్‌కంటాక్స్, మీడి యాలకు అకౌంట్ల గుట్టుముట్లను నిత్యమూ  విడుదల చేస్తారు. ఇంగ్లండ్‌లో కూచుని లలిత్‌మోదీ వసుంధరను ఇలాగే మెల్లమెల్లగా రోజూ హతమారుస్తున్నాడు.

 

 చంద్రబాబు తన చుట్టూ ఉన్న సంపన్న వ్యాపార వేత్తలను బహిష్కరిస్తే వారాయన గుట్టుమట్లు రట్టు చేస్తారు. వారు తనకు సమస్యలను సృష్టిస్తున్నారని తెలిసినా ఆయన వారిని ప్రేమిస్తూ ఉండాల్సిందే. రాజ కీయ వేత్తలుగా మారిన వ్యాపారవేత్తలతోనే చాలా కుం భకోణాలు మొదలయ్యాయని చంద్రబాబు గ్రహించాలి. వారిని ప్రేమించాలి గానీ దూరంగా ఉంచాలి. సీనియర్ రాజకీయనేతలే గనుక ఇప్పుడు బాబుకు సలహాలిస్తూ ఉండివుంటే ‘ఓటుకు కోట్లు’ కుంభకోణం జరిగి ఉండేదే కాదు. పట్టుబడినా డబ్బుంది గాబట్టి లాయర్లు బయట పడేస్తారనే ధీమా సంపన్నుల కుంటుంది. కాబట్టే అందు లోని ప్రమాదాల గురించి సంపన్నులకు ఎప్పుడూ పట్టదు. సుష్మా, వసుంధరలే గనుక కాల చక్రాన్ని వెనక్కు తిప్పగలిగితే లలిత్ మోదీలను దరిచేరనీయరు. ఒక్క ములాయమే అమర్‌సింగ్‌ను గెంటేసే ధైర్యం చేయ గలిగారు. బాబు తెలుగు అమర్ సింగ్‌లను గెంటేయ గలరా?

 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)

 -పెంటపాటి పుల్లారావు

 e-mail:Drpullarao1948@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top