పాకిస్తాన్ స్వయంకృతమే


 ఘోరం. క్రూరం. దారుణం. ఈ మాటలేవీ పాకిస్తాన్‌లో చిన్నారి పిల్లలపై జరిగిన మారణకాండను వర్ణించడానికి సరిపోవు. పెషావర్ నగ రంలోని సైనిక పాఠశాల పిల్లలపై తాలిబాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 145 మంది పిల్లలను, ఉపాధ్యాయులను, సిబ్బందిని పొట్టనబెట్టుకోవడం విషాదకరం. ఉగ్రవాదులు మానవ మృగాలుగా మారి అభంశుభం తెలియని పిల్లలను హత మార్చడం క్షంతవ్యం కాని నేరం. తాలిబాన్లు ఎంతటి దురాగతానికైనా పాల్పడతారనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. పసిపిల్లలపైకి తూటాలు ఎక్కుపెట్టడం దిగ్భ్రాం తికరం.

 

 చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయం. తమపై దాడి చేస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని ఎదిరించి నిలువలేని ముష్కర మూకలు ఆ సైని కుల పిల్లలు చదివే పాఠశాలపై దాడిచేయడం పిరికిపందల క్రూర చర్య తప్పితే మరేమీ కాదు. అయితే ఆదినుంచీ ఉగ్రవాదులకు పాలు పోసి పెంచి పోషించిన పాకిస్తాన్‌కు తాజా రాక్షసకాండ కేవలం స్వయం కృతమే. ఎప్పటినుంచో భారతదేశంపై కత్తులు దూస్తున్న లష్కరే తోయిబా వంటి ముష్కర మూకలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవాలి. ప్రపంచ దేశాలతో కలసి తీవ్రవాదంపై పోరుకు సిద్ధమవ్వాలి.

 బట్టా రామకృష్ణ దేవాంగ  సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top