‘గిరులెక్కితే సిరులు రావు.. కానీ...

‘గిరులెక్కితే సిరులు రావు.. కానీ...


మల్లి మస్తాన్‌బాబు... ఈ పేరు విన్నా, చది వినా.. ఆంధ్రరాష్ట్ర ప్రజలెవరికైనా.. ముఖ్యం గా నెల్లూరు జిల్లా వాసులకి ఆనందంతోపాటు హృదయాన్ని మెలిపెట్టే బాధ. జీవితమంటే ఎప్పుడూ విజయాల పరంపర ఉండదు. గెలు పుని నిర్దేశించుకుంటూ సాగే పయనంలో ఓట ములెన్నో. ప్రతి ఓటమి మరో గెలుపునకు ఒక పాఠం. కానీ మస్తాన్‌బాబు నిర్దేశించుకున్న ఏడు ఖండాల్లోని ఎత్తై పర్వతారోహణల్లో చిలీలోని ఆండీ పర్వతారోహణ అతి క్లిష్టమైనదని భావించి చివరగా ఆ పర్వతాన్ని అధిరోహించడానికి సమాయత్తమై ఉండవచ్చు.


ఆ సమయంలో వాతావరణం అనుకూలించక సహచ రులు బేస్ క్యాంప్‌లోనే ఆగిపోవడం... మస్తాన్‌బాబు ఒక్కడే పర్వతారో హణకు పూనుకోవడం, పర్వతాన్ని అధిరోహించడం అతని ధైర్యసాహ సాలకే కాదు, త్యాగనిరతికి కూడా ఓ మచ్చు తునక. వార్తా పత్రికల్లో, అంతర్జాలంలో మస్తాన్‌బాబు నిర్జీవదేహాన్ని చూస్తున్నప్పుడు గుండెల్ని పిండేసే బాధ. ఏంటిలా... ఎలా జరిగిందసలు? ఎలా జరిగుంటుం ది? అన్న సమాధానం లేని ప్రశ్నలు, జవాబులు.  ఐనా నిర్జీవమైన అతని ముఖంలో విజయానందం!




 ఏప్రిల్ 7 ఉదయం దినపత్రికలు చదువుతున్నప్పుడు పుంఖాను పుంఖాలుగా మల్లిమస్తాన్‌బాబు ఫొటోలతో కూడిన పర్వతారోహణకు సంబంధించిన విజయగాథలు. అరెరే.. మస్తాన్‌టబాబు మన జిల్లా వ్యక్తే అని తెలుసుకున్నప్పుడు ప్రతి వార్త వెనుక నా కళ్లు పరుగులెట్టడం ప్రారంభించాయి. సంగం మండలం, గాంధీజన సంఘంలో పుట్టి పెరిగిన మస్తాన్‌బాబు క్రికెట్ లాంటి క్రేజీ గేమ్‌ని కాకుండా, అడ్వెంచరస్ స్పోర్ట్స్‌లో భాగమైన పర్వతారోహణని ఇష్టంతో ఎన్నుకోవడం ఆశ్చర్యపరచింది.




 సాటి పర్వతారోహకురాలు ‘నాన్సీ’ నేరుగా అమెరికా నుండి మస్తాన్‌బాబు మరణ వార్త తెలుసుకుని మారుమూలనున్న కుగ్రామా నికి చేరుకుని మస్తాన్‌బాబు కుటుంబ సభ్యులతోపాటు అతని పార్థీవ దేహం కోసం ఎదురుచూడటం... స్నేహం కోసం మస్తాన్‌బాబు ఎంత ఆసక్తి చూపుతాడో, చెలిమిలోని సహ చర్యపు అనుభూతులు ఆవిడని ఎంతటి విచలితురాలను చేశాయో కన్నీళ్లు నిండిన కళ్లతో ఎదురు చూసే ఆమె వ్యక్తిత్వం ఆశ్చర్యచకితుల్ని చేశాయి.


నిరుపేద వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యలభ్యసించి, చేసిన ఉద్యోగాలు వద్దను కుని కేవలం ప్రపంచపటంలో భారత పతాకాన్ని ఒక స్థానంలో నిల పెట్టాలని తపన. ‘గిరులెక్కితే సిరులు రాలవని తెలిసినా, తన ధ్యేయం తో కూడిన ఆశయం వైపు మొగ్గు చూపాడు మస్తాన్‌బాబు.




అదేవిధంగా మస్తాన్‌బాబు ఏ పర్వతాన్ని అధిరోహించినా.. రుద్రాక్షమాల, భగవద్గీతలను వెంట తీసుకెళ్లడం అతని దైవచింతనకు, కృతనిశ్చయానికి ప్రతీకలుగా నిలబడటమే కాకుండా, మానవశక్తి ఏ కార్యానికైనా ఉపకరిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ప్రతి ఛాయా చిత్రంలో ఏదో ఒక రూపంలో మన జాతీయ జెండా అతని మెడలోనో, అతని చేతుల్లోనో, అతని చెంతనో.. మన త్రివర్ణ పతాకాన్ని చూస్తుంటే ఈ విజయాలు నా ఒక్కడివే కాదు ఈ జెండాకి కూడా నా విజయాల్లో భాగమనే విషయం మిగతా భారతీయులందరికీ స్ఫూర్తిని రగిలిస్తోంది.


ఇరవై ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘రోజా’ సినిమాలో భారత జాతీయ జెండాని ముష్కరులు అవమానించినప్పుడు.. హీరో చూపిన సాహసం, తెగువ, తెంపరితనం.. మస్తాన్‌బాబు మెడలో పతకాన్ని చూసినప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకునేలా.. ‘నేను సైతం.. అని నినదిస్తున్నాడనే విషయం వినిపించకనే వినిపించాడు.




 మళ్లీ మస్తాన్‌బాబు మరణానికి ఇద్దరు తల్లులు శోకిస్తున్నారు. ఒక రు మస్తాన్‌బాబు కన్నతల్లి. మరొకరు మస్తాన్‌బాబు కన్న తల్లిని కూడా కన్న తల్లి భరతమాత! నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డకి గిరులంటే ఎంత ఇష్టమో ఆ పర్వతాలే ఇష్టంగా తమలో ఇముడ్చుకున్న తీరు గర్వంగా అనిపించినా.. మస్తాన్‌బాబు ఓ గొప్ప హీరో అనిపించుకున్నాడు. కాదు.. కాదు.. నెల్లూరు జిల్లా వాసులందరినీ రాత్రికి రాత్రే హీరోలని చేసి వెళ్లిపోయాడు.    


నావూరు శ్రీధర్


(పర్వతారోహకుడు మస్తాన్‌బాబు చిరస్మరణలో)

 వ్యాసకర్త బార్ అసోసియేషన్ కార్యదర్శి, నెల్లూరు మొబైల్ : 94410 03948

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top