రైతుకు రుణ మాఫీ ఊరట

రైతుకు రుణ మాఫీ ఊరట - Sakshi


విశ్లేషణ

పరిమిత రుణ మాఫీ సైతం రైతుల తక్షణ సమస్యలను తీర్చి, వ్యవసాయ పను లను మొదలెట్టగలిగేలా చేస్తుంది. కీలక పరిష్కారం మాత్రం సముచితమైన మద్దతు ధరలు, నిల్వ సదుపాయాలు, కోల్డ్‌ స్టోరేజ్‌ వసతులను అందించడమే.



రుణ మాఫీ, ప్రభుత్వానికి గానీ, రైతులకుగానీ ఆర్థి కంగా అర్థవంతమైన చర్యేమీ కాదని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ గట్టిగా చెప్పేవారు. ఆయనే ఇçప్పుడు, కొన్ని షరతులతోనే అయినా అందుకు అంగీకరించారు. ఇప్పటికే రూ. 3.71 లక్షల కోట్ల రుణ భారాన్ని మోస్తున్న ఫడణవిస్‌ ప్రభుత్వానికి రూ. 30,000 కోట్ల రైతు రుణ మాఫీకి నిధులను సమకూర్చుకోవడం సులువేమీ కాదు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల కోసం ఉద్దేశించిన పలు సంక్షేమ పథకాలకు కత్తెర వేయడం అవసరం అవుతుంది. రుణ మాఫీ నిజంగానే జరగాలంటే రుణగ్రస్తు లుగా ఉన్న్డ రైతులకు తిరిగి రుణాలను మంజూరు చేయడం ప్రారంభించమని బ్యాంకులకు సంకేతాలను పంపడం మాత్రమే సరిపోదు.



బ్యాంకులు తమ ఖాతా పుస్తకాలను బ్యాలెన్స్‌ చేసుకోడానికి వీలుగా నిజంగానే వాటికి డబ్బును చెల్లించడం అవసరం. వాణిజ్య బ్యాంకులకు బకాయిపడ్డ కార్పొరేట్‌ సంస్థలు తమ రుణాలను ఇష్టానుసారం వాయిదా వేయించుకోవడం రైతుల రుణ మాఫీ డిమాండుకు నైతిక ప్రాతిపదికను సమకూరుస్తోంది. రుణ మాఫీకి అంగీకరించడం ద్వారా ఫఢణవిస్, మాఫీ కోసం డిమాండ్‌ చేయడం, నిరసనలు తెలపడం అనే క్రీడకు  ప్రతిపక్షాన్ని దూరంగా ఉంచగిలిగారు, అంతే. ఇతర పార్టీలు తాము కూడా రైతులకు మద్ద తుగా ఉన్నామని అంటున్నా వారిని రెచ్చగొట్టేవేవీ కాదు. కాకపోతే అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన రైతుల పక్షాన నిలిచి, బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను కలుగజేస్తోంది.



ఇక పది రోజుల పాటూ జరిగిన రైతుల ‘‘సమ్మె’’ కు సంబంధించి ఆసక్తికరమైన అంశం అందుకు ఎంచు కున్న సమయమే. తర్వాతి పంట వేసే క్రమం మొదలు కావాల్సి ఉంది, అది ఎలాగూ రుతుపవనాల రాకతో ముడిపడి అనివార్యంగా జరిగేదే. చాలా మంది తమ భూములను విత్తడానికి సిద్ధం చేసుకున్నారు. చేతిలో చేయడానికి పనిలేక, ప్రదర్శనలు చేయడానికి వీలుగా ఖాళీగా ఉన్నారు. మొత్తంగా ఈ పంటల సీజనంతా ముందుం డటంతో  రైతులు ఈ సమ్మెను ఎంతో కాలం కొనసాగిం చరనేది వాస్తవం. పళ్లు, కూరగాయలు పండించేవారు ఈ సమ్మెలో ప్రధానంగా పాల్గొంటున్నట్టు కనిపిస్తోంది. టోకు బజార్లకు సరఫరాలు క్షీణించడాన్నిSతట్టుకోడానికి ప్రధాన మహారాష్ట్ర నగరాలు ఇతర రాష్ట్రాలవైపు, ప్రత్యే కించి గుజరాత్‌వైపు చూస్తున్నాయి.

 

ఈ రుణ మాఫీకి రెండు షరతులు వర్తిస్తాయి. ఒకటి, చిన్న రైతులందరికీ, అంటే ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న రైతులందరికీ ఇది వర్తిస్తుంది. రెండు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు తమకు ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకోడానికి కొంత కాలం, కనీసం ఒక నెలో లేక రెండు నెలలో వేచి చూడాలి. రెండో కోవకు చెందిన వారికి సంబంధించి, మంత్రులు, రైతులతో కూడిన బృందం ఇతర రాష్ట్రాల లోని రుణ మాఫీని అధ్యయనం చేస్తుంది. అయితే రెండో కోవలోని వారంతా ఆ ప్రయోజనాలకు అర్హులు కాక పోవచ్చు. వ్యాపారం, ఉద్యోగం వగైరా ఇతర వన రులు ఉన్నవారు దాని పరిధికి వెలుపలే ఉండాల్సి రావచ్చు.



రైతులు దూకుడుగా ఉండటమే కాదు, చీలిపోయి ఉన్నారు కూడా. రైతులలోని ఒక విభాగం, భూమి ఎంత ఉన్నది అనే దానితో నిమిత్తం లేకుండా అందరికీ రుణమాఫీని కోరుతుండటమే అందుకు కారణం.  అయితే, ఈ రుణమాఫీ వల్ల లబ్ధి చేకూరే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రైతులలో దాదాపు 80 శాతం మంది ఐదు ఎకరాల లోపు భూయాజమాన్యం ఉన్న వారి వర్గంలోకే వస్తారు. రుణమాఫీ పట్ల సార్వత్రికంగా సంతోషం వ్యక్తం అవుతోంది గానీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం చిన్న రెతులకు సంబంధించైనా ఈ పథకం వివరాలను వెల్ల డించలేదు. ఒక్కో రైతు రుణ మాఫీ రూ. 1,00,000కు మించక పోవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పరిమితం అవు తుంది. లబ్ధిదారులు కాగల అర్హత ఉన్నవారికి ఈ పరిస్థితి ఇంకా అర్థం కాకపోయి ఉండవచ్చు.



ఈ పరిమిత రుణ మాఫీ సైతం రైతుల తక్షణ సమస్యలను తీర్చి, వారు తిరిగి వ్యవసాయ కార్య కలాపాలను ప్రారంభించగలిగేలా చేస్తుంది. సాగుబడి లాభదాయకంగా ఉండటం లేదు కాబట్టి ఈ సహాయం సైతం ప్రభావశీలమైనదే. కీలకమైన పరిష్కారం మాత్రం సముచితమైన మద్దతు ధరలు, నిల్వ సదు పాయాలు, కోల్డ్‌ స్టోరేజ్‌ వసతులను కల్పించడమే. దశా బ్దాలు గడుస్తున్నా అది మాత్రం జరగడం లేదు. ధరల రూపేణా, మౌలిక సదుపాయాల రూపేణా లభించే మద్దతుతోనే  రైతులు ఆత్మహత్యలకు పాల్పడ కుండా నిలవరించగలుగుతారు. గత దశాబ్ద కాలంలోనే దాదాపు 18,000 మంది రైతులు తక్షణ బాధల నుంచి వ్యక్తిగతంగా విముక్తి కావాలని  ఉరి వేసుకున్నారు లేదా విషం తాగారు. తద్వారా వారు తమ కుటుంబాలను నిరాధారంగా గాలికి వదిలేశారు.



మహేష్‌ విజాపృకర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ :mvijapurkar@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top