తెలుగు అధికార భాష అనడం అబద్ధం


తెలుగు రానివాడికీ, తెలుగు మాత్రమే వచ్చిన వాడికీ ఆంగ్లం తెలియక పోవడం వల్ల తీరని అన్యాయం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడా తల్లిభాషకు ఇంత ద్రోహం జరగడంలేదు. ఆంగ్లభాషా బానిసత్వపు జాడ్యం ఆంధ్రానికి పట్టుకుంది.

 

పార్లమెంట్‌లో హిందీ, ఇంగ్లిష్ భాషలు వాడుతున్నప్పు డు సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఆ రెండు భాషలను ఎందుకు వినియోగించడం లేదు? అని ఒక నాగరికుడు న్యాయ మం త్రిత్వ శాఖను సమాచార హక్కు కింద అడిగాడు. పార్ల మెంట్ మరో చట్టం చేసే వర కు ఉన్నత న్యాయస్థానాలలో, ఉభయ సభలలో, రాష్ట్రా ల శాసనసభలలోనూ బిల్లులు, చట్టాల సవరణలు, రాష్ట్రపతి, గవర్నర్‌లు జారీ చేసే ఆర్డినెన్స్‌లు, రాజ్యాం గం కింద, పార్లమెంట్ శాసనసభలు చేసిన చట్టాల కింద, జారీ చేసే ఉత్తర్వులు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉండా లని రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 స్పష్టంగా చెప్పింది.


348(2) కింద రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఏ రాష్ట్రమైనా తమ హైకోర్టులో హిందీ లేదా తమ భాషను వినియోగించుకోవడానికి నిర్ణయం తీసుకోవచ్చు. ఒక వేళ ఏ రాష్ట్రమైనా ఇంగ్లిష్ కాకుండా మరొక భారతీయ భాషను నిర్దేశిస్తే, ఆ రాష్ట్రంలో చేసిన బిల్లులకు, చట్టా లకు ఇంగ్లిష్ అనువాదాలు అధికారిక రాజపత్రాలలో ప్రచురించాలి. అంటే భారతీయ భాషను అత్యున్నత న్యాయ, శాసన విభాగాలలో ఉపయోగించడానికి వీలు లేదు. ఈ ఆర్టికల్ ప్రకారం వ్యవహరిస్తున్నామని న్యాయ మంత్రిత్వ శాఖవారు జవాబు ఇచ్చారు.




 భారతీయ భాషా ప్రేమికులు ఎంత గింజుకున్నా లాభం లేదు. ఇటీవల విజయవాడలో రెండురోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరి గాయి. మన భాషను ఎక్కువగా వాడాలని మంత్రులు, న్యాయమూర్తులు, కవులు, రచయితలు, పండితులు, నటులు సముచిత సందేశాలు ఇచ్చారు. ఏ విధంగా అనే సందేహానికి మాత్రం సమాధానం ఏ భాషలోనూ దొరక లేదు. జీవించే హక్కులో తెలుసుకునే హక్కు కూడా ఉం దని సర్వోన్నత న్యాయస్థానం అనేకమార్లు వివరించిం ది. ఆ మాట ఇంగ్లిష్‌లో చెప్పింది. తెలుగు, హిందీ వంటి భారతీయ భాషలు మాత్రమే తెలిసిన వారికి ఈ హక్కు ఉందని తెలియదు.


సర్వోన్నత శాసనం మన రాజ్యాం గం, ఇంకా వేలాది చట్టాలు ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికీ, ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ తెలుగు లో చట్టాలు లేవు. తెలుగులో చట్టాలు ఉండాలని చట్టమే లేదు. పుట్టి పెరుగుతున్న ప్రతి పౌరుడికీ చట్టాలు తెలు సునని న్యాయశాస్త్రం భావిస్తుంది. ఇది చట్టపరంగా వమ్ముకాని భావన. నాకు ఇంగ్లిష్ రాదు, తెలుగే వచ్చు. కనుక నాకు హక్కులూ బాధ్యతల గురించి తెలియదంటే కోర్టులు అంగీకరించవు. నీకు తెలిసినా తెలియకపోయి నా తెలుసని భావించి, తప్పు చేస్తే శిక్ష వేస్తారు.




 రేషన్ కార్డు దరఖాస్తు నుంచి మొదలై మంచినీటి సరఫరా, వాహనం లెసైన్స్, బడిలో చేరడానికి దర ఖాస్తు, ఓటరు కార్డు, పదో తరగతి పత్రాలు వంటి అనే కానేక వ్యవహారిక పనులన్నీ తెలుగువాడు వచ్చీరాని ఆంగ్లంలో చేయవలసిందే. కవిత్వం, సాహిత్యం, నవ లలు తప్ప మిగిలిన అన్ని రంగాలలో వాడేది ఆంగ్లమో, లేక ఆంధ్రాంగ్ల సంకరమో తప్ప ఆంధ్రం మాత్రం కాదు. తెలుగు అధికార భాష అన్నది అన్నిటికన్నా పెద్ద అబ ద్ధం. అది వ్యవహార భాష కూడా కాదు.


‘సత్యమేవ జయతే’ అనే వేదవాక్యం మన నినాదం, విధానం కాదు. అబద్ధం ఆధారంగా మనుగడ సాగిస్తున్న మనం ఆడే మరొక అబద్ధం- తెలుగే అధికార భాష. రాజ్యాంగం, శిక్షాస్మృతి వంటి కీలకమైన శాసనాలు తెలుగులో లేకుం డా వాటిని తెలుసుకుని పౌరులు ఏ విధంగా అనుసరిస్తా రని తెలుగు భాషాభిమానులు ఆలోచించవలసి ఉంది. సాధారణ జీవనంలో, సమాజంలో అందరితో సంభా షించడానికీ, లేఖలకీ, ఈమెయిల్స్ -పొట్టి ముచ్చట్లు పంపుకోవడానికీ తగిన భాషను తయారుచేసి, దాన్ని వినియోగించే సాంకేతిక ప్రజ్ఞను సమకూర్చకుండా తెలుగో తెలుగని గుండెలు బాదుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం?




 తనకు అన్యాయం జరిగితే తెలుగువాడు పోలీసు స్టేషన్‌లలో తెలుగులో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉం దా? దానికి దిక్కూ మొక్కూ ఉంటుందా? ఆ నేరానికి సంబంధించి ఇచ్చే ప్రకటనలు వాంగ్మూలాలు తెలుగు లో నమోదు చేసుకునే వీలు ఎంతవరకు ఉంది? ఆరో పణ పత్రాలు ఆంగ్లంలో ఉంటే తెలుగు మాత్రమే తెలి సిన నిందితుల గతేమిటి? వారి నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలను ఇంగ్లిష్‌లో వెల్లడిస్తే, తెలుగులో చెప్పినా వాటిని ఇంగ్లిష్‌లోకి అనువదిస్తే, ఆ అనువాదం సరిగ్గా ఉన్నదో లేదో- ఇవన్నీ ఎవరు వివరిస్తారు? కోట్లాది కేసుల గందరగోళంలో పడి ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేని న్యాయాధికారులు, న్యాయమూర్తులు ఆ అనువాదాలను పరిశీలించి, సక్రమంగా ఉన్నాయో లేదో నిందితుడికి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? నిజా నికి కోర్టులలో ఎంత మందికి తెలుగు వచ్చు? అందులో ఎందరికి నిజంగా ఇంగ్లిష్ వచ్చు?




 తెలుగులో న్యాయం దొరకదు. ఇంగ్లిష్‌తో పాటు చట్టాలు కూడా తెలిసీ తెలియని న్యాయవాదులు, అస లు ఏమీ తెలియని న్యాయార్థులను మోసం చేస్తూ ఉన్నా, దీని మీద కూడా ఫిర్యాదు ఇంగ్లిష్‌లో చేసుకోవ లసిందే. తెలుగు రానివాడికీ, తెలుగు మాత్రమే వచ్చిన వాడికీ ఆంగ్లం తెలియక పోవడం వల్ల తీరని అన్యాయం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడా జన్మభూమిలో తల్లి భాషకు ఇంత ద్రోహం జరగడం లేదు. ఆంగ్లభాషా బాని సత్వపు జాడ్యం ఆంధ్రానికి పట్టుకుంది. తెలుగు అంత రించే భాషలలో ఉందంటే ఆశ్చర్యమా?

 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)


professorsridhar@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top