మహిళా శక్తికి జోహార్లు - ఇన్ బాక్స్

మహిళా శక్తికి జోహార్లు - ఇన్ బాక్స్ - Sakshi


 మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు కాంట్రాక్టర్ల అవినీతిపై విరుచుకు పడిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహి ళ కావడం గర్వకారణం. రహదారుల నిర్మాణంలో అవకతవకలపై ఆమె స్పందన అందరినీ ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని యూట్యూబ్‌లో చూసిన లక్షలాదిమంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో యూపీ లోనే ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపిన దుర్గాశక్తి నాగ్‌పాల్ కూడా నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ఇలాంటి ఐఏఎస్ అధికా రులు మనకూ ఉంటే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ నిజాయితీగా ఉన్నతాధికారులను మన నేతలు ప్రాధాన్యత లేని శాఖ లకు బదిలీచేయడం ద్వారా అభివృద్ధికి పాతరేస్తున్నారు. మళ్లీ ఇదే నాయకులు అభివృద్ధిపై ఉపన్యాసాలు దంచుతుంటారు. ఇలాంటి వాళ్లని ఏమనాలి? దీనికి ఒకే ఒక్క ఉదాహరణ. లిక్కర్ సిండికేట్ వ్యవ హారంలో అత్యంత నిజాయితీగా వ్యవహరించిన అధికారి శ్రీనివాస్‌ను ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి ప్రమోషన్ సాకుతో విశాఖకు బదిలీ చేసిన ఉదంతం అప్పట్లో సంచలనం రేపింది. నూటికో కోటికో ఇప్ప టికీ నిజాయితీకి కట్టుబడిన అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా రాజకీయ ప్రమేయం లేకుండా ఉంటే అభివృద్ధి చర్యలు పూర్తి కావడమే కాకుండా అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

 శొంటి విశ్వనాథం  చిక్కడపల్లి, హైదరాబాద్



 లక్ష ఉద్యోగాల మాటేంటి?

 కొత్తగా ఏర్పడిన ‘నవ తెలంగాణ’ రాష్ట్రంలో ఒక లక్ష పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక మంత్రివర్యులే స్వయంగా సెలవిచ్చారు! సంవత్సరాల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగావకా శాలు లేకుండాపోయాయి. వేలాది మంది ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల నుండి, ఉన్నత విద్యాసంస్థల నుండి విద్య పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు కానీ, నిరుద్యోగం మాత్రం తీవ్రస్థాయిలో పేరుకుపోయింది. ఉద్యమాల బాటలో నడిచిన విద్యార్థులు నవ తెలంగాణలో ఉద్యోగా లపై కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగుల స్థితిగతుల గురించి ఆలోచించి, వారి ఆశలని వమ్ము చేయకుండా ఒక నిర్దిష్ట దృక్పథంతో అన్ని ప్రభుత్వశాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల్లో ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను పూరించవల సివుంది. ఉద్యోగ ఖాళీలను దశల వారీగా నింపినా, ఒకేసారి నింపినా సామాజికంగా అన్నివర్గాల వారికి న్యాయం చేయవలసి ఉంది. ఒప్పం ద ఉద్యోగులుగా ఉన్న వారికి సైతం కొంత శాతం మేరకు బోనస్ మా ర్కులిచ్చి, ఉద్యోగ ఖాళీల భర్తీకోసం నిర్వహించు పోటీ పరీక్షలో అవకా శం కలిగిస్తే వారు ప్రయోజనం పొందుతారు కదా! ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసు వారిని కూడా వినియోగించుకుంటే అందరికీ మేలు.

 కూర్మాచలం వెంకటేశ్వర్లు  ఎం.ఎం.తోట, కరీంనగర్



 అగ్ర రాజ్యం ‘ఉగ్ర’మూలం

 తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధాలు అమ్ముకుని సొమ్ము  చేసుకునే అగ్రరాజ్యం అమెరికాయే ప్రపంచమంతటా ఉగ్రవాదానికి ఆజ్యం పోసి, దేశదేశాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తోంది. ఇదిలా ఉంటే తీరుమారని పాకిస్తాన్, దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషించిన పాపం నేడు పాములా వెంటాడి పెషావర్ సైనిక పాఠశా లలో పసిపిల్లల మరణానికి కారణమైంది. తనదాకా వస్తే కానీ తెలియ దన్నట్లు, ఆఖరికి ఉగ్రవాదం వల్ల తామే నష్టపోయామన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నట్లయింది. అమాయక పసిప్రాణాలు బలి అయితే తప్ప పాకిస్తాన్ పాలకులకు తాము చేసిన పాపం తెలిసి రాలేదు. భారతదేశం ఎన్నిసార్లు ఉగ్రవాదుల విషయంలో విజ్ఞప్తులు చేసినా బేఖాతరు చేసిన పాపం నేడు పసిపిల్లల ప్రాణాలను అన్యా యంగా బలి గొన్నది. భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ పాక్ వైఖరిని తప్పు పట్టిన నాడే ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు కదా? తాలిబాన్ ఉగ్రవాదులు విచక్షణారహి తంగా తలపెట్టిన ఈ దుశ్చర్యకు యావత్ ప్రపంచం పాకిస్తాన్‌పై మం డిపడుతోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు తాము చేసిన తప్పు తెలుసుకుని సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలికి, ప్రపంచవ్యాప్త  ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలి.

 శిష్ట్లా మురళీ సుధాకర్  చందానగర్, హైదరాబాద్



రైతు భారతం బతుకు భారం

 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ శాంపిల్ సర్వే సంస్థ తాజా నివేదిక ప్రకారం దేశంలో దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రైతుల్లో తొంభై శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. వీరిలో సగానికి పైగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. పదేళ్లలో రైతుల సంఖ్య దిగ జారి కూలీల సంఖ్య పెరగటం ఒకెత్తు కాగా, వారి జీవనావసరాలు తీర్చే తృణమో, ఫణమో ఆదాయం వ్యవసాయేతర మార్గాల్లో వస్తు న్నది తప్ప వారి ముఖ్య ఆధారమైన వ్యవసాయం ద్వారా వస్తున్నది కాదు. ఈ గణాంకాల ద్వారా సగటు రైతు బతుకు ఎంత చితికిపో యిందో తెలుస్తోంది. దేశంలో మూడొంతుల జనాభాకి వ్యవసాయమే ముఖ్య ఆదాయ వనరు అయినప్పుడు ఆ రంగం కుదేలైతే దేశం కుదేలై నట్లే. డెబ్బైలలో హరిత విప్లవం ద్వారా స్వయంసమృద్ధి సాధించిన మనదేశం ఆ ఫలశ్రుతిని రాన్రానూ కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమవు తున్నాయి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్య ధోరణి మన దేశానికి ఆత్మహత్యా సదృశ్యమే. పారిశ్రామిక ప్రగతికి ఆలోచించడం, పెట్టుబడులను ఆకర్షించడంలో తప్పులేదు. అయితే అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయరంగం బలోపేతం కాకుండా దేశం సొంతకాళ్లమీద నిలబడటం సాధ్యం కాదు. రైతు సంక్షే మం కోసం ప్రభుత్వం ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేయాలి.

 డా॥డి.వి.జి. శంకరరావు  మాజీ ఎంపీ, పార్వతీపురం



 గిరిజనం పురజనం కావద్దా?

 రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులే. ఈ గిరిజనం పురజనం కాకుండా ఉంచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కనబడుతోంది. విద్యతోపాటు ఆర్థిక రంగానికి కూడా గిరిజనులను దూరంగా ఉంచాలని చేస్తున్న ప్రయ త్నాన్ని తరచిచూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ‘బీద లు బీదలుగానే ఉండాలి. నిరక్షరాస్యులు నిరక్షరాస్యులు గానే ఉండాలి’ అనే లక్ష్య సాధనలో అటు ప్రభుత్వమూ, ఇటు ఉన్నతాధికారులూ చేయి కలిపినట్లుంది. నవ్యాంధ్ర నిర్మాణంలో గిరిజనుల భాగస్వామ్యం లేకపోవటం బాధాకరం. చంద్రబాబు మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించకపోగా గిరిజన సలహా మండలి, ఎస్‌టి లెజిస్లేటివ్ కమిటీని నేటివరకూ నియ మించలేదు. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకోసం ప్రభు త్వం ఎలాంటి కార్యాచరణను రూపొందించలేదు. గత ఆరునెలలుగా గిరిజనుల అభివృద్ధికి ఒక్క అంశం కూడా ప్రారంభించకపోవడం బాధాకరం. మెగా సిటీలు, స్మార్ట్ సిటీ లపై, గిరిజన ప్రాంతాల్లోని ఖనిజ నిక్షేపాలు, బాక్సైట్... ఎర్రచందనంపై ఉన్న ప్రేమ గిరిజనుల అభి వృద్ధిపై లేదు. కనీసం తమకు ఇది కావాలి అని నోరు తెరిచి అడగలేని గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.

 ఎం. హనుమంత నాయక్  ఏపీ గిరిజన జేఏసీ, గుంటూరు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top