తీర్పు ఎలాగున్నా గెలుపు బీజేపీదే

తీర్పు ఎలాగున్నా గెలుపు బీజేపీదే - Sakshi


జాతిహితం



ప్రపంచ జిహాదీ ఉగ్రవాదం పెంపొంది, మితవాద ముస్లింల పట్ల ప్రపంచవ్యాప్తంగా అనుమానాస్పద దృష్టి పెరుగుతుండటంతో ముస్లింలకు బహుభార్యత్వం, అధిక సంతాన స్వేచ్ఛ ఇచ్చారనే వాదన మెజారిటీలో ప్రతిధ్వనించడం మొదలైంది. మోదీ–షాలు రాజకీయ లబ్ధి కోసం వాటికి సంతోషంగా ఆజ్యం పోశారు. ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ఉదారవాద సామాజిక సంస్కరణగా ఎవరికైనా కనబడే మూడు తలాక్‌లపై వారు తమ రాజకీయ ఇంద్రజాలంతో ఏకాభిప్రాయాన్ని రుద్దగలుగుతున్నారు.



ముస్లిం మహిళలకు మూడు తలాక్‌లతో విడాకులిచ్చే  పద్ధతిని నిషేధించా లని నేడు సాగుతున్న ఉద్యమం మేధోపరంగా, తాత్వికంగా రెండు భిన్న శిబిరాలుగా  చీలిపోయింది (ఇక్కడ ‘‘రాజకీయ’’ అనే పదాన్ని నేను జాగ్ర త్తగా ఆలోచించే మినహాయించాను). ఆ సమస్య, సుప్రీం కోర్టు విచారణలు లేదా అలవాటుగా సాగే టీవీ ‘‘చర్చల’’లో వెల్లడయ్యేదానికంటే మరింత సంక్లిష్టమైనది కావడమే అందుకు కారణం. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ రెండు శిబిరాలకు దూరంగా ఉండటమే, ఈ సమస్య ఎంత సంక్లిష్టమైనదన డానికి కొట్టవచ్చినట్టు కనిపించే ఉదాహరణ.



అవన్నీ ఒకే పక్షాన ఉన్నాయి. బీజేపీ లాంటి  కొందరు సామాజిక సంస్క రణకు ఒక కారణం దొరికిందని, ఏడు దశాబ్దాల ‘‘సంతృప్తిపరచే విధానా నికి’’ స్వస్తి పలకాలని అనాలోచిత సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా మరికొందరు తక్కువ చేసి చూపే కపటత్వంతో ముస్లిం మహిళలకు సమాన హక్కులను కల్పించే మార్పు అనివార్యత గురించి మాట్లాడుతున్నారు. ప్రధాన స్రవంతికి చెందినవారు ఎవరూ దీన్ని వ్యతిరేకించలేని స్థితిలో ఉన్నారు.



ఇది అతిశయీకరించడం, లేదా అతిగా సరళీకరించడం, లేదా ఆ రెండూ కొంత కొంత కలసి ఉండటం కావచ్చు. కానీ మూడు తలాక్‌ల సమస్య ఇప్పుడు పాకిస్థాన్, కశ్మీర్‌ లేదా అవినీతిలాంటి సమస్యగా మారిపోయింది. వాటిలాగే ఈ సమస్యపై కూడా ఏకాభిప్రాయ సాధనను మీరు దాటవేయ లేరు. తయారుచేసినదే అనండి లేదా దొడ్డిదోవన సాధించినదే అనండి లేదా తప్పించుకోలేనిదే అనండి కానీ ఏకాభిప్రాయం అవసరం. అదే నేటి రాజకీ యాలకు సంబంధించిన వాస్తవికత. కపిల్‌ సిబల్‌ ముస్లిం మితవాద సంస్థ లకు ప్రాతినిద్యం వహిస్తున్నప్పుడల్లా కాంగ్రెస్‌ నేతలు ఎంతగా సంకోచిస్తుం టారో మీరే గమనించండి.



బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల తాత్విక, భావజాల విజయం

ఉదారవాద (వామపక్షాలు సహా) ప్రధాన స్రవంతి  ఈ సమస్యపై వెను కకు తగ్గింది. దీనిపై ఏమైనా ప్రశ్నించే పనిని.. మార్పును వ్యతిరేకించలేని నిర్లక్ష్య ధోరణిగల అతివాద ‘‘ఉదారవాదుల’’ చిన్న బృందానికి వదిలి పెట్టేశారు. మూడు తలాక్‌ల పద్ధతి కొనసాగింపునకు మద్దతు పలకడానికి వారు సాహసించనూ లేరు. ఉద్దేశపూర్వకమైన దురుద్దేశంతోనే బీజేపీ తన ప్రాధాన్యాలను తప్పుగా ఎంచుకుంటున్నదని ఆ పార్టీని ఆక్షేపించడం మాత్ర మే వారు చేస్తారు. బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ దాన్ని లెక్కచేయవు, లెక్క చేయాల్సిన అవసరమూ లేదు. అది వారు ఇటీవలి కాలంలో సాధించిన అతి పెద్ద భావ జాల, తాత్విక విజయం. అందుకు వారు సంబరపడుతున్నారు. 17 కోట్ల బలీ యమైన మైనారిటీ తమను ఎప్పుడూ ఓడిస్తూనే ఉన్నా, ప్రతిపక్షం దాని కోసమే  రాజకీయంగా సరైనదైన, వివేకవంతమైన సంస్కరణ విషయంలో ఏకీభవించక తప్పని పరిస్థితిని కల్పించారు.



సుప్రీం కోర్టు ఏమని తీర్పు చెప్పినా, నేటి మూడు తలాక్‌ల సమస్య హిందూ మితవాదులకు విజయమే. ఒక్క ఈ విజయం కోసమే ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు... నరేంద్ర మోదీ, అమిత్‌ షాలకు తమ హిందూ యోధులలో అత్యు న్నత స్థానాన్ని కట్టబెట్టవచ్చు. ప్రధానిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి నెహ్రూ వాద పదజాలంలో సమ్మిళితత్వాన్ని నిర్వచించి, దానికి కట్టుబడ్డారు. అందు వల్లనే ఆయన పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దల దృష్టి అనుమానాస్పదత నుంచి ధిక్కారం వరకు విస్తరించి ఉండేది. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి, ఏ సామాజిక గ్రూపులలో దేనికీ భంగం కలిగించరాదు, లోపలి నుంచే మెల్లగా మార్పు దానికదే రానివ్వండి అనే వైఖరిని ఆయన అవలంబించారు. మరో విధంగా చెప్పాలంటే, భావజాలాన్ని, ఓట్ల రాజకీయాలనూ పరిపాలనకు దూరంగా ఉంచడం. అందువల్లనే ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మితవాదం ఆయన ప్రభుత్వాన్ని నిజమైన బీజేపీ ప్రభుత్వంగా చూడలేదు. అది సరైనదే. మోదీ, అమిత్‌ షాలు వారికి నిజమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇచ్చారు.



ముస్లిం శిక్షా స్మృతిలోని చట్టాలను సంస్కరించడం, ప్రత్యేకించి వివాహం, విడాకుల అంశాలను సంస్కరించడం హిందూ మితవాదులకు ఓ మనో జాఢ్యంలాగా పట్టుకుంది. అందుకు కారణాలు ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలలో ఉన్నాయి. నెహ్రూ జనాకర్షణ అత్యున్నత స్థాయిలో ఉన్న అప్పట్లో హిందూ శిక్షాస్మృతి బిల్లులను నెగ్గించుకొచ్చేశారు. స్వతంత్ర భార తంలో అవే ఇంతవరకు అత్యంత విస్తృతమైన, ఆహ్వానించదగిన, రాజకీయీ కరించిన సామాజిక సంస్కరణలు. నాటి ఆ శాసనం, కుటుంబ చట్టాలలోనే మహిళలకు రాజ్యాంగపరమైన సమానత్వాన్ని ఇచ్చి, హిందూ సమాజంలోని అతి చెడు సంప్రదాయాలను అంతమొందించింది. కాలక్రమేణా, అది హిందువులలోని మెజారిటీకి ఎంతో మేలును కలుగజేసింది, వివాహం, వార సత్వం, దత్తత, వితంతు పునర్వివాహం, మోనోగమీ (ఒకే భార్య ఒకే భర్త)పై మరింత మెరుగైన చట్టాలు రావడానికి దారితీసింది. దాన్ని హిందువులు చాలావరకు ఆమోదించారు. అరవైల మధ్యకే రాజకీయ సమస్యగా అది అంతర్ధానమైపోయింది.



నెహ్రూనే బీజాలు వేశారా?

ఆ కాలం నాటి చర్చలను చదివితే, కాంగ్రెస్‌లోని మితవాదులు ఆ చట్టాన్ని వ్యతిరేకించారని తెలుస్తుంది. ఆనాటి నెహ్రూవాద లౌకికవాద హయాంలో ఆ వ్యతిరేకత స్వల్పమైనదిగానే లెక్కలోకి వచ్చింది. ఆ చర్చలో ఓటమిపాలైన వారు కడుపు మంటతోనూ, ఆ గాయాల మచ్చలతోనూ మిగిలిపోయారు. కాలక్రమేణా పాత ‘‘సాంప్రదాయక’’ రివాజులను పునరుద్ధరించాలన్న మితవాద డిమాండు అంతరించిపోయింది. కానీ, హిందూ శిక్షాస్మృతి బిల్లు ‘‘అమృతం’’ అయితే, మరి దాన్ని మన ముస్లిం సహోదరులకు ఎందుకు నిరాకరిస్తున్నట్టు? అది ‘‘విషం’’ అయితే దాన్ని మా హిందువులతోనే ఎందుకు మింగిస్తున్నారు? అనే వాదన మిగిలిపోయింది. ఇది, నేను చిన్న పట్టణంలో ఆరేళ్ల పిల్లాడిగా ఉండగా బడి ఎగ్గొట్టి మరీ చూసిన మొదటి ఎన్నికల సభలో (జనసంఘ్‌ది) విన్న వాక్యానికి కచ్చితమైన అనువాదం.



కాలక్రమేణా ఈ భయాన్ని పెంచి మరింత పెద్ద భయాలను రేకెత్తిం చారు. ముస్లింలకు ఎక్కువ మంది భార్యలను అనుమతించి, ఎందరినైనా స్వేచ్ఛగా కనమన్నారని వ్యాఖ్యానించారు. ‘మనం హిందువులు’’ కుటుంబ నియంత్రణ పాటిస్తుండగా(ముస్లిం భర్తలు తమ నలుగురు భార్యలతో) ‘‘మేం ఐదుగురం, మాకు పాతికమంది (పిల్లలు)’’ అంటున్నారని 2002 సెప్టెంబర్లో నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సుప్రసిద్ధమైన వ్యాఖ్య చేశారు. ప్రపంచ జిహాదీ ఉగ్రవాదం పెంపొంది, ప్రపంచవ్యాప్తంగానే మిత వాద ముస్లింల పట్ల అనుమానాస్పద దృష్టి పెరుగుతుండటంతో ఈ వాదన మెజారీటీలో ప్రతిధ్వనించడం ప్రారంభమైంది. మోదీ–షా బీజేపీ, తమకు ముందటి వాజపేయి–అద్వానీలకు భిన్నంగా రాజకీయ లబ్ధి కోసం వీటికి ఆజ్యం పోయడానికి సంతోషంగా వాడుకున్నారు. ‘‘స్మశానం, కబ్రిస్థాన్‌’’ అనేది ఈ వ్యూహపు అత్యంత ప్రభావశీలమైన పోలిక అయింది. ఇది వారి రాజకీయ ఐంద్రజాలిక శక్తిని చాటుతుంది. సాధారణమైన వారికెవరికైనా ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ఉదారవాద సామాజిక సంస్క రణగా కనబడే దానిపై వారు.. ముస్లిం విద్వేషాన్ని ప్రయోగించి నేడు ఏకా భిప్రాయాన్ని రుద్దగలుగుతున్నారు.



ఇది నెహ్రను తిట్టిపోసే కాలం. కాబట్టి నేడు ఇలా లౌకికత్వాన్ని పున ర్నిర్వచించడానికి బీజాలను వేసినది ఆయనేనా అని అడుగుదాం. తన రాజ కీయ ప్రతిష్టను ప్రయోగించి సామాజిక, కుటుంబ సంస్కరణలను కేవలం మెజారిటీపైనే రుద్ది, మిగతా మైనారిటీలను వారి సొంత మత పెద్దలకు లేదా అంతర్గత సంస్కరణ ఉద్యమాలకు వదిలిపెట్టేశారా? కైస్తవ, సిక్కు,ముస్లిం మతాల నుంచి... స్త్రీజననాంగ విచ్ఛేదానికి (ఎఫ్‌జీఎం) పాల్పడే దావూదీ బోరాల వంటి చిన్న మత శాఖల వరకు అన్నీ ఆ సంస్కరణ ఉద్యమాల్లో చాలా వాటిని పాశవికంగా అణచివేశాయి. హిందువులలోని బహు భార్య త్వాన్ని నిషేధించగలిగిన లౌకికవాద పార్లమెంటు ఎఫ్‌జీఎంను ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద (ఉదా‘‘కు తీవ్ర గాయాలు చేయడానికి చెందిన 320 సెక్షన్‌) తీవ్ర నేరంగా లేదా హత్యా ప్రయత్నంగా ప్రకటించలేక పోయిందా?



నెహ్రూ వారసుల నిర్వాకం

నెహ్రూ ఆ పని ఎందుకు చేయలేకపోయారనే దానిపై చాలానే విశ్లేషణ జరి గింది. హిందువులను విభజించి, మైనారిటీలను ‘‘సంతృప్తిపరచి’’ ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలకు పునాదులను వేశారని విమర్శకులంటారు. నెహ్రూలోని దేశవిభజనానంతర ఆదర్శవాదం, అపరాధ భావన అందుకు కారణమని ఆయన అభిమానుల వాదన. ఆయనే గనుక ముస్లిం శిక్షాస్మృతిలో మార్పులను రుద్ది ఉంటే మరింతమంది పాకిస్తాన్‌కు తరలి పోవడం కొనసా గేదని, వారికి భరోసాలను కల్పించడంలో భాగంగానే ఆ స్వేచ్ఛలను ఇవ్వాల్సి వచ్చిందని వారి వాదన.



ఆయనకున్న మేధస్సు, నైతిక ఆధిపత్యం లేదా దృఢమైన లౌకికతత్వం ఆయన వారసులకు లేవు. మైనారిటీలను సంతృప్తిపరచడం అనే ఈ భావ నను వారు మరింత బలోపేతం చేశారు. ఇందిరాగాంధీ, బాబాలు, సాధు వులు, తాంత్రికులు, యోగులను చేరదీశారు. షా బానో కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన ఉదారవాద తీర్పును తోసిపుచ్చడానికి రాజీవ్‌గాంధీ చట్టాన్ని  వెనక్కు తిప్పారు. ఆ తర్వాత గాభరాతో అతి దిద్దుబాటుకు పాల్పడి అయో ధ్యలో శిలాన్యాస్‌ను అనుమతించారు. 1989 ఎన్నికల ప్రచారంలో రామ రాజ్యాన్ని సైతం వాగ్దానం చేశారు. ముస్లిం వ్యతిరేకమైనదంటూ పోటాను (ఉగ్రవాద నిరోధక చట్టం) రద్దుచేసి యూపీఏ దీన్ని మరో స్థాయికి తీసు కుపోయింది. 26/11 ముంబై ఉగ్రదాడులు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రేనని ప్రకటించే తమ నేతలను అదుపు చేయడంలో విఫలమైంది. నెహ్రూలోని లౌకికవాదా నికి నైతికత్వపు మెరుపు ఉండేది. ఆయన వారసులకు అది లేదు.



ఆయన పార్టీ, ప్రత్యేకించి 1985 నుంచి లౌకికవాదాన్ని పూర్తిగా రాజకీ యాలను దట్టించి అందించింది. జిన్నా తర్వాత భారత ముస్లింలు ఏ ముస్లిం నూ తమ నేతగా విశ్వసించలేదని, ‘‘లౌకికవాద’’ హిందూనేతలే వారికి నేతృ   త్వం వహించసాగారనీ, వారి ఓట్లను, వారి జీవన నాణ్యతను కూడా తమ సొంతంగానే భావించారనీ గతంలో నేను రాశాను. లోతుగా విశ్లేషిస్తే మోదీ, షాలు ఆ రాజకీయ భావనను హతమార్చి, సమాధి చేశారనో లేదా దహనం చేశారనో తేలుతుంది.

twitter@shekargupta

శేఖర్‌ గుప్తా

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top