ఆధ్యాత్మికతపై జీఎస్టీనా.. వద్దే వద్దు

ఆధ్యాత్మికతపై జీఎస్టీనా.. వద్దే వద్దు


దేశవ్యాప్తంగా పన్ను వ్యవస్థను, దాని నిర్వహణను మరింత సులభతరం చేయడానికి, క్రమబద్ధం చేయడానికి పలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల స్థానంలో వచ్చే జూలై 1 నుంచి జీఎస్టీ (ఎSఖీ) వస్తు సేవా పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వస్తు సేవా పన్ను చట్టం 2017లో మతపరమైన వ్యవహారాల గురించి ప్రస్తావనే లేదు. ప్రతి వస్తువు, సేవ కేవలం ధనార్జన ధ్యేయంగా సాగే వ్యవహారంగా చట్టంలో పరిగణించటం ఆశ్చర్యకరం. ఎన్నో ప్రపంచ దేశాలు మత సంస్థలను జీఎస్టీ పరిధిలోంచి మినహా యింపు ఇచ్చాయి. భారత్‌ కూడా అటువంటి చొరవ తీసుకోవాలని ఆశిస్తున్నాము.



20 లక్షల వరకు, అంతకు పైబడిన వార్షిక ఆదాయం గల దేవాలయాలన్నీ జీఎస్టీ కోరల్లోకి రాబోతున్నాయి. దేవాదాయ చట్టం ప్రకారం ఇప్పటికే  ఊఅఊ,  అగిఊ వగైరాల కింద 21.5 శాతం ఆదాయాన్ని కోల్పోతున్న దేవాలయాలు, 18 శాతం జీఎస్టీకి కోల్పోక తప్పదు. గతంలో ఒకసారి తిరుపతి లడ్డూ ప్రసాదానికి కూడా పన్ను కట్టాల్సిందే అనటంతో.. ట్రిబ్యునల్‌ మొట్టికాయ వేస్తూ అది లాభార్జన ధ్యేయంతో చేసిన వస్తూత్పత్తి కాదని హితబోధ చేసింది.



జీఎస్టీలో ప్రవేశ రుసుముతో ప్రాంగణ ప్రవేశాన్ని కూడా వ్యాపారంగా నిర్వచించారు. ఈ నిర్వచనం వల్ల దర్శనం టిక్కెట్లకు, కళ్యాణ మండపాలకు, కళ్యాణోత్సవాలకు పన్ను తప్పదు. దేవాలయాలు, దర్శన వ్యవహారాలు, ప్రసాదాలు, సత్రాల వంటివి పాలకులకు సరుకు డిమాండ్‌–సరఫరా–పంపిణీ పరిభాషలా కనిపిస్తున్నప్పుడు ప్రతి భక్తుడూ ఆలోచించి తగు విధంగా స్పందించాల్సి ఉంది.

      


                           – సీఎస్‌ రంగరాజన్, ప్రధాన అర్చకులు,

                               చిలుకూరు బాలాజీ దేవాలయ

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top