గ్రహం అనుగ్రహం, మంగళవారం 6, అక్టోబర్ 2015

గ్రహం అనుగ్రహం, మంగళవారం 6, అక్టోబర్ 2015 - Sakshi


శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి బ.నవమి రా.7.10 వరకు,

నక్షత్రం పునర్వసు ప.1.40 వరకు, తదుపరి పుష్యమి,

వర్జ్యం రా.10.00 నుంచి 11.38 వరకు,

దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.07 వరకు,

తదుపరి రా.10.34 నుంచి 11.24 వరకు,

అమృతఘడియలు ఉ.11.12 నుంచి 12.53 వరకు

సూర్యోదయం    :    5.54

సూర్యాస్తమయం    :    5.43

రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు

యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు



భవిష్యం

 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

 

వృషభం: కొత్త వ్యక్తులు పరిచయం. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు,ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

 

మిథునం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

 

కర్కాటకం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

 

సింహం
: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

 

కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

 

తుల
: పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు. విందువినోదాలు. పనులు సజావుగా సాగుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు,ఉద్యోగాలలో ప్రోత్సాహం.

 

వృశ్చికం: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

 

ధనుస్సు: రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

 

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 

కుంభం: స్థిరాస్తి లాభం. సోదరులు, బంధువులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.



మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. దూరప్రయాణాలు. దైవచింతన. అనారోగ్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

 

- సింహంభట్ల సుబ్బారావు

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top