సీసీ కెమెరా చెప్పేదీ సాక్ష్యమే

సీసీ కెమెరా చెప్పేదీ సాక్ష్యమే - Sakshi


విశ్లేషణ

 

నిర్ద్వంద్వ సాక్ష్యమైన సీసీ కెమెరా రికార్డింగ్ నేరం చేసిన వారెవరో తెలుసుకుని శిక్షించి న్యాయం చేయడానికి అవసరం. సాంకేతిక పరిజ్ఞానం అందుకు ఉపయోగపడాలి. ఆ రికార్డింగ్ లక్ష్యం నేరస్తులను తెలుసుకోవడమే.

 

కట్నంవేధింపుల సెక్షన్ 498ఎ కేసులో కొడుక్కు బెయిల్ కోసం ఒక తండ్రి కోర్టుకు వెళ్లి, బయటకు వస్తుండగా 15 మం ది అతని మీద దాడి చేశారు. భార్య తరఫు న్యాయవాది కూ డా దుండగుల్లో ఉన్నాడని ఆ రోపణ. అక్కడే గోడకు అమ ర్చిన సీసీ కెమెరా ఈ ఘటనను రికార్డు చేసింది. తనపైన దాడి చేసిన వారిని శిక్షింపజే యడానికి  సహకరించే విధంగా ఆ సీసీ కెమెరా రికార్డిం గ్ సీడీని ఇవ్వాలని సమాచార చట్టం కింద ఆయన అభ్య ర్థించాడు. సీసీ కెమెరా రికార్డింగ్‌ను ఇవ్వకూడదని సెక్యూరిటీ కమిటీ తీర్మానించిందని పీఐఓ చెప్పారు. ఏడు రోజుల తర్వాత రికార్డింగ్ సహజంగానే చెరిగి పోయి కొత్త దృశ్యాలు రికార్డు అవుతాయని వివరిం చారు. ఇవ్వకూడదని వాదిస్తే రికార్డింగ్ ఉన్నట్టే.  



అసలు సీసీ కెమెరాలు ఎందుకు అమర్చారు, వాటి రికార్డులను ఏం చేస్తారు? అని అడగాల్సివచ్చింది. ఏవై నా అవాంఛనీయమైన ఘటనలు జరిగితే వాటికి పాల్ప డిన  వారెవరో తెలుసుకోడానికి ఆ రికార్డింగ్ ఉపయోగ పడుతుందని, అది సాక్ష్యం కూడా అవుతుందని పీఐఓ అంగీకరించాడు. దొంగతనం, దౌర్జన్యం, మిలిటెంట్ల దాడి తదితర అవాంఛనీయ ఘటనలు ఏం జరిగినా సీసీ కెమెరా రికార్డు చేస్తుంది, అది సాక్ష్యంగా పనికి వస్తుంది కూడా. కాబట్టి దయచేసి ఆ రికార్డును తొలగించకండి అని కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. ఇవ్వడానికి నిరా కరిస్తున్నారే తప్ప, అది లేకుండా పోలేదని తండ్రి పేర్కొ న్నారు. నేను ఇటీవలే ఆ రికార్డింగ్‌ను చూశాను. నిర్ద్వం ద్వ సాక్ష్యమైన సీసీ కెమెరా రికార్డింగ్‌ను ఇవ్వడం, ఆ తండ్రీ కొడుకుల కోసమో, కోడలి కోసమో కాదు. దౌర్జ న్య నేరం చేసిన వారెవరో తెలుసుకుని శిక్షించి న్యాయం చేయడానికి అవసరం. సాంకేతిక పరిజ్ఞానం అందుకు ఉపయోగపడాలి. ఆ రికార్డింగ్ లక్ష్యం నేరస్తులను తెలు సుకోవడమే. అందువల్ల నిందితులు నిర్దోషులని తేలే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిశోధనకు, నేర విచార ణకు అత్యవసరమైన పరికరం సీసీ కెమెరా రికార్డు.



సహ చట్టం సెక్షన్ 8 కింద సీసీ కెమెరా రికార్డింగు ను మినహాయించారా? వ్యక్తుల సొంత కదలికలను, ప్రజలకు సంబంధం లేని వ్యవహారాలను రికార్డింగ్ చేసి ఉంటే దాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదు. కాని ఈ కేసులో అటువంటి వాదనేదీ లేదు.

 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 2(1) (ఓ) కింద ‘డేటా’ అంటే కంప్యూటర్ రికార్డింగ్‌లు, సీసీ కెమెరా రికార్డింగ్‌లూ వస్తాయని నిర్వచించారు. ఎల క్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారం అంటే ఏమిటో సెక్షన్ 2(1) (ఆర్) వివరించింది. సెక్షన్ 2(1) (టి) ప్రకా రం ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే కంప్యూటర్‌లో గానీ, అటు వంటి మరొక పరికరంలో గానీ నమోదయిన డిజిటల్ దృశ్యం అవుతుంది. సెక్షన్ 6 ప్రకారం ఎలక్ట్రానిక్ రికా ర్డులను, డిజిటల్ సంతకాలను వాడేందుకు ప్రభుత్వ సంస్థలకు అధికారం ఉంది. ఐటీ చట్టం రెండో షెడ్యూ లు ద్వారా సాక్ష్య చట్టాన్ని సవరించి... ఎలక్ట్రానిక్ పత్రా లతో సహా అన్ని రకాల దస్తావేజులను కోర్టు పరిశీలనకు సమర్పించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.  



సమాచార హక్కు చట్టం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం సమాచారం అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమా చారం కూడా అవుతుంది. సెక్షన్ 2(ఐ) ప్రకారం రికార్డు అంటే మైక్రోఫిల్మ్, కంప్యూటర్ గానీ అటువంటి మరే పరికరంలో గానీ దాచిన అంశాలు కావచ్చు. 2 (జె) ప్రకారం సమాచార హక్కు అంటే డిస్క్‌లు, ఫ్లాపీలు, టేప్‌లు, వీడియో క్యాసెట్లు లేదా ఇతరత్రా ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారం తీసుకోవడం కూడా అని వివరంగా ఉంది. కనుక సీసీ కెమెరా రికార్డింగ్ రూపం లో ఉన్న దృశ్యాల యథాతథ చిత్రీకరణలు కోర్టులు అనే ప్రజాసంస్థలో లభ్యంగా ఉన్న సమాచారం అని సమా చార కమిషనర్ హోదాలో నిర్ణయించాను. అది ఇవ్వకూ డని సమాచారం అనే వాదం ఇందులో లేదు. సమాచా రం ఇవ్వాలా, ఇవ్వకూడదా? అనేది సమాచార చట్టం ప్రకారం నిర్ణయించాలే గానీ సెక్యూరిటీ కమిటీ తీర్మా నాల ద్వారా కాదు.



ఒక నేర సంఘటనకు సంబంధించిన దృశ్యాల రికార్డులను సాక్ష్యంగా పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి సంస్థపైనా ఉంటుంది. కోర్టులకు కూడా ఆ బాధ్యత ఉంది. అసలు ఎవరూ అడగకుండానే నేరానికి సంబం ధించిన సమాచారాన్ని దర్యాప్తు చేసే పోలీసు సంస్థకు ఇవ్వడం ఢిల్లీలోని కకర్డుమా కోర్టుల బాధ్యత. ఆ పని వారు చేయకపోవడం వల్లనే బాధితులైన వారే స్వయం గా పరిశోధించి తెలుసుకోవలసి వచ్చింది. తమ పరి ధిలో జరిగిన నేరానికి సంబంధించిన వివరాలు ఇవ్వ డం బాధ్యతే అయినా ఇవ్వరు. ఇది పాలనా లోపం. సుపరిపాలన సంగతి దేవుడెరుగు. పరిపాలనే లేదు. అడిగినా ఇవ్వననడం దుష్పరిపాలన. కోర్టులోనే ఇటు వంటి దుష్పరిపాలన ఉంటే న్యాయానికి దిక్కెవరు? సాక్ష్యంగా ఉపయోగపడే రికార్డును రక్షించాలని కోరిన తరవాత కూడా అది చెరిగిపోయిందని కోర్టు అధికారు లు వాదిస్తే కావాలని సాక్ష్యం ధ్వంసం చేసి, దాడి చేసిన నేరగాళ్లతో చేతులు కలిపిన కుట్రదారులయ్యే అవకాశం ఉంది. వారిని ఐపీసీ కింద శిక్షించవలసి వస్తుంది. సెక్షన్ 20 సహ చట్టం కింద కూడా అది జరిమానా విధించవ లసిన తప్పు. కనుక సీసీ కెమెరా రికార్డింగ్ ఇవ్వవలసిం దే అన్నది న్యాయ నిర్ణయం. ఎవరు నిజం చెబుతున్నా రో తెలియనప్పుడు సాక్ష్యాలు దాచడం కూడా నేరమే.

 

 http://img.sakshi.net/images/cms/2015-04/41429815819_295x200.jpg

మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)

 professorsridhar@gmail.com

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top