సీమాంధ్ర రెవెన్యూ లోటుకు పరిష్కారం ఏదీ?


పార్లమెంట్‌లో ఏం జరిగింది -28

విభజన బిల్లుపై 20-02-2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు

 

డిప్యూటీ చైర్మన్: 16 వ సవరణ ప్రతిపాదించారు. ప్రభుత్వం ఒప్పుకుంటోందా?

హోంమంత్రి: నా ఉపన్యాసంలో వివరించాను. అందుచేత ఒప్పుకోవటం లేదు.

డిప్యూటీ చైర్మన్: వెంకయ్య నాయుడు గారూ ప్రభుత్వం ఒప్పుకోవటంలేదు.

వెంకయ్యనాయుడు: సార్, క్లాజ్ ఏమిటో, సవరణ ఏమిటో నాతో సహా ఎవ్వరికీ అర్థం కావటంలేదు. ఈ అరుపులు కేకల మధ్య.

ఆయన చదువుతున్నాడో మాట్లాడుతున్నాడో...

డిప్యూటీ చైర్మన్:  వెంకయ్యనాయుడు గారి సవరణ సభ ముందుంచుతున్నా 

(16) such area పక్కనే ఈ పదాలు చేర్చాలి.

సవరణ తిరస్కరించబడింది.

 క్లాజ్ 8, 9 బిల్లులో భాగాలయ్యాయి.

 క్లాజ్ 11, సుఖేంద్ శేఖర్‌రాయ్ గారి సవరణలో కూడా ఆయన ‘నో’ అన్నారు.

 క్లాజ్ 10, 11 నుంచి 29 వరకూ కలపబడ్డాయి.

డిప్యూటీ చైర్మన్: క్లాజ్ 30కి 32 సవరణ, రామాజోయిస్ గారి ప్రతిపాదన.

రామాజోయిస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నా లేకపోయినా హైకోర్టు మాత్రం ఉండాలి. ఆర్టికల్ - 231 ప్రకారం రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండొచ్చు. నేను పంజాబ్ హర్యానా హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌గా పని చేశాను. చెప్తుంటే వినరే.. మీరు వినకపోతే నా పాయింట్ ఎలా చెప్పను?

డిప్యూటీ చైర్మన్: నేను వింటున్నా చెప్పండి. అధ్యక్షస్థానం వింటోంది.

రామాజోయిస్: నా సవరణ ఏమిటంటే, ఆర్టికల్ 214 ఈ యాక్ట్‌లోని సెక్షన్ 31 ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్‌కి మరో హైకోర్టు ఏర్పడేవరకూ’ అనే పదాలు తొలగించాలి. అందువల్ల హైదరాబాద్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుంది.

డిప్యూటీ చైర్మన్: మీరేమయినా చెప్పాలా హోంమంత్రిగారూ!

హోంమంత్రి: మేం రాజ్యాంగబద్ధులం. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం చేయాలి. అందుకే ఆ రకంగా బిల్లుతో కలిపాం.

డిప్యూటీ చైర్మన్:రామాజోయిస్ సవరణ ఉంచాలా?

రామాజోయిస్: నేను సవరణ కోరుతున్నా

 సభ సవరణను తిరస్కరించింది. క్లాజ్ 30 కలపబడింది.

డిప్యూటీ చైర్మన్: రామాజోయిస్ గారి మరో సవరణ క్లాజ్ 31కి. ఉంచాలా.. 

రామాజోయిస్: ఇది చాలా ముఖ్యమైనది. ఆర్టికల్ 231 ప్రకారం రెండు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోనే హైకోర్టు ఉండాలి. 

డిప్యూటీ చైర్మన్: సవరణ కావాలా? సభముందుంచాలా?

రామాజోయిస్: అవును. 32 నుండి 41 పంక్తులు తొలగించాలి.

సవరణ తిరస్కరించబడింది. క్లాజ్ 31 కలపబడింది.

డిప్యూటీ చైర్మన్: క్లాజ్ 32కి రామాజోయిస్ గారి సవరణ ఉంది.

రామాజోయిస్: సార్, ఈ సవరణలన్నీ ఒక దానికొకటి అనుబంధం సవరణ సభ ముందుంచాలి.

డిప్యూటీ చైర్మన్: సవరణ తిరస్కరించబడింది. క్లాజ్ 32 బిల్లులో కలుపబడింది. 32, 34 సవరణలు మీవే రామాజోయిస్ గారూ!

రామాజోయిస్: ఇవన్నీ కలిపే ప్రతిపాదించాను.

డిప్యూటీ చైర్మన్: ఇప్పుడు సభ ముందుకు పెట్టనక్కర్లేదుగా... సరే ఆయన ‘నో’ అంటున్నారు. 

క్లాజ్ 34 బిల్లులో భాగమైంది.

క్లాజ్ 35 నుండి 45 వరకూ బిల్లులో భాగమయ్యాయి. క్లాజ్ 46 కి మూడు సవరణలు ఉన్నాయి. దీరక్ బిరేన్, అరుణ్‌జైట్లీ ‘నో’ అన్నారు. నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్) గారూ మీ సవరణ ఏమంటారు? 

నరేష్ గుజ్రాల్: పేజీ 11లో 51వ లైన్ తర్వాత ఈ భాగం కలపాలి. సబ్‌క్లాజ్ (3) ప్రకారం, ఏదైనా ప్యాకేజీ ఇస్తున్నప్పుడు ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక లోటును పరిగణనలోకి తీసుకోవాలి.

వెంకయ్యనాయుడు:  పేజీ 11 లోని 45వ లైన్‌లో ' may’  బదులు 'shall' అని మార్చాలి. సవరణలు సభ ముందు ఉంచబడ్డాయి.

వెంకయ్యనాయుడు:  కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే లోపు సీమాంధ్రకు రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఆ తేడా భర్తీ చేయడానికి చర్యలు చేపడతామని ప్రభుత్వం మాకు చెప్పింది. వచ్చే బడ్జెట్ వరకూ, మేం చూసుకుంటాం అని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో రాష్ట్రం ఏమవ్వాలి? జీతాలు, పెన్షన్‌లు, ఇతర చెల్లింపులు ఎలా ఇస్తారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఒత్తిడి తెస్తున్నా. క్లాజ్ 46, పేజీ 11, లైన్ 48 లో పదాలు చూడండి. ‘రాష్ట్రం లోని ఏరియాలు’. ఒక స్వతంత్ర నిపుణుల కమిటీ నియమించి, ఆర్థికలోటు అంచనావేసి ప్రణాళికేతర గ్రాంట్లు సిఫార్సు చేయటమే కాకుండా, రెవెన్యూ లోటుకు సరిపడా గ్రాంటు కూడా సెక్షన్ 67 (ఎ)లో చెప్పినట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కనీసం పదేళ్ల పాటు అందించాలి. అప్పటిలోపు, మొట్టమొదటి సంవత్సరానికి, కన్సాలిడేటెడ్ ఫండ్(ఏకీకృత నిధి) నుండి 10,000 కోట్లు ఇవ్వాలి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తే...

 

-ఉండవల్లి అరుణ్‌కుమార్

వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com
Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top