ఈ చేతా ఆ చేతా బొమ్మలేసిన గోపులు

గోపాలన్(గోపులు)


గోపులుకి పక్షవాతం వచ్చి కుడిచెయ్యి పడిపోయింది. చూడ్డానికి వెళితే, ‘నాకు బ్రష్ స్ట్రోక్ రాదనేవారు, ఎట్టకేలకు స్ట్రోక్ వచ్చింది’ అంటూ నవ్వారు. ఎడమ చేత్తో బొమ్మలు సాధించి, ఆనక కుడిచేతిని స్వాధీనం చేసుకుని సవ్యసాచి అయినారు.

 

 ఆయన గొప్ప ఆర్టిస్టు. ఆయ న గొప్ప కార్టూనిస్టు. ‘నేను ఆ ర్టూనిస్టుని’ అని చెప్పుకునే వారు గోపులు. అసలు పేరు గోపాలన్. తమిళనాడు, తం జావూరులో పుట్టి పెరిగారు. భయమూ, భక్తీ పుట్టుకతోనే అబ్బాయి. చిత్రకళ తర్వాత అబ్బింది. అన్నీ కలసి ఏడు దశాబ్దాల పాటు తమిళదేశంలో గోపులు ఇంటింటి పేరు గా నిలిచారు. మొన్న - ఏప్రిల్ 29న కన్నుమూసిన సవ్య సాచికి నివాళిగా-

 బాపు బొమ్మ తెలుగుజాతి ప్రతి నిధి అయినట్టే, గోపులు బొమ్మ తమిళ త్వానికి ప్రతీక. ఇద్దరూ మంచి మిత్రు లు. ‘నాకు గురువు’ అని బాపు, కాదు ‘నాకే గురువు’ అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు. బాపు ఒక వారధిగా లేకపోతే, తెలుగువారికి గోపులు ఇం తగా తెలియడానికి అవకాశం లేదు. బాపు పబ్లిసిటీ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయం, కడదాకా కొనసా గింది. బాపు ఆ రోజుల్లో అత్యధిక పారి తోషికం తీసుకునే ఆర్ట్ డెరైక్టరు. అయి నా, వద్దని వచ్చేసి సాక్షితో నిర్మాతగా, దర్శకుడిగా మారారు. అప్పట్లో గోపులుని సొంతంగా ఏజెన్సీ పెట్ట మని బాపు చెబుతూ ఉండేవారట. ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో బాపు గోపులు ఇంటికి వెళ్లేవారు. చాలాసార్లు నన్ను కూడా తీసుకువెళ్లారు. అప్పుడప్పుడే చీకటి వేళలో గోపులు బాపు కోసం ఎదురుచూస్తూ ఉండే వేళలో వెళ్లే వాళ్లం. వారింట్లో వంట మామి ఇడ్లీలు వండి వడ్డించేది. అవి పరమాద్భుతంగా ఉండేవి. గోపులు రాత్రిళ్లు అవే తినేవారు. నాకు ఇడ్లీలు ప్రత్యేక ఆకర్షణ, ఆ తర్వాత గోపులు స్వచ్ఛమైన తమిళయాస. వేడివేడి ఇడ్లీలు వడ్డిం చి, ‘రొంబసూడు’ అనేవారు. ఆ మాటలో వేడిని అనుభ వించేవాడిని. బాపు, గోపులు మాట్లాడుకుంటుంటే నాకు అనేక సంగతులు అర్థమయేవి. ఎయిర్ ఇండియాకి మహారాజాని డిజైన్ చేసిన ఉమేశ్‌రావు గొప్పతనాన్ని గురించి మాట్లాడుకునే వారు. తమిళనాట తొలినాళ్ల ఇలస్ట్రే టర్, కార్టూనిస్ట్ మహాలింగం మాటలూ వచ్చేవి. ‘మాలి’ పేరుతో ఆయన ప్రసి ద్ధులు. ఆయనే గోపాలన్‌ని ప్రోత్సహిం చి గోపులుగా మార్చారట. ఏజెన్సీలో మరో మిత్రుడు థాను గురించిన కబు ర్లు వచ్చేవి. ‘ఆయన గీత అంతగా బావుండదనేవారు గాని బాపు అతని గీత అద్భుతం కదూ!’ అంటూ గోపులు మొదలుపెట్టారు. క్లెయింట్స్  అతని బొమ్మలను వద్దనేవారట. ఆయనకు విసుగువేసింది. ఫ్రెంచ్ భాష వచ్చిన థాను పది మందికి ఫ్రెంచ్ ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టాడు. త్వర త్వరగా ఎదిగాడు. ఆ త్రివిక్రముడు తర్వాత బ్రిలియంట్ ట్యుటోరియల్స్ అయినాడు. రీడర్స్ డెజైస్ట్ లాంటి పత్రి కల్లో బ్రిలియంట్స్ వ్యాపార ప్రకటనలు వచ్చేవి. ‘బాపూ! సామ్రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి థాను ఇప్పుడు కొడెకైనాల్‌లో విశ్రాంతిగా కాలక్షేపం చేస్తు న్నాడు. ఎప్పుడూ మనిద్దర్నీ రమ్మంటాడు’ అని సం తోషంగా చెప్పేవారు.

 

 గోపులు చిత్రకళలోని అన్ని శాఖలకీ కొత్త చిగుళ్లు తొడిగారు. కామిక్స్ నుంచి రాజకీయ కార్టూన్ల దాకా, కథల బొమ్మలు, కవర్‌పేజీలు, లోగోలు, వ్యాపార ప్రకటనలూ- ఇలా అన్నింటా అవుననిపించుకున్నారు. ‘యాడ్ వేవ్’ పేరిట సొంత ఏజెన్సీ ప్రారంభించి ప్రథమ స్థానంలో నిలిపారు. ఆరుద్ర అనువాద కావ్యం ‘వెన్నెల- వేసవి’కి బాపు గోపులుతో బొమ్మలు వేయిం చారు.

 

 గోపులు మాట్లాడని కార్టూన్ల గురించి బాపు తెగ చెప్పి నవ్వేవారు. గోపులుకి పక్షవాతం వచ్చి కుడిచెయ్యి పడిపోయింది. చూడ్డానికి వెళితే, ‘నాకు బ్రష్ స్ట్రోక్ రాదనేవారు, ఎట్టకేలకు స్ట్రోక్ వచ్చింది’ అంటూ నవ్వా రు. ఎడమ చేత్తో బొమ్మలు సాధించి, ఆనక కుడిచేతిని స్వాధీనం చేసుకుని సవ్యసాచి అయినారు. కళా ప్రపం చానికి స్ఫూర్తి గోపులు.

 ( శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top