ఆ ఆకుపచ్చ జెండా రేపుతున్న కలకలం...

ఆ ఆకుపచ్చ జెండా రేపుతున్న కలకలం... - Sakshi


కశ్మీర్‌లో ఓ వ్యక్తి జెండా పట్టుకున్నాడు. అది పాకిస్తాన్ జెండా. దీంతో మన మీడియా దుమారాన్ని లేవదీసింది. తీరా ఆ జెండాను తాను పట్టుకోలేదని సభలో కొందరు వ్యక్తులు పట్టుకున్నారని అతడు వివరణ ఇచ్చాడు. జెండా పట్టుకుంటే తప్పేంటన్నాడు. దీంతో అతడు కశ్మీర్ వేర్పాటువాదుల హీరో అయిపోయాడు. ఇంతకూ మన మీడియా సాధించిందేమిటి?

 

కశ్మీర్ నుంచి వచ్చిన వార్త దేశం మొత్తాన్ని ఒక్కటిగా చేసిం ది. మన జాతీయ వాదాన్ని ఒక్కసారిగా ప్రేరేపిస్తూ భారతీ యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతకూ ఆ కథనం ఏమిటి? ఒక వ్యక్తి ఒక జెండా పట్టుకున్నాడు. అయితే అది మన ప్రజలు కోరుకునే జెండా కాదు. అది భిన్నమైన జెండా. ఈ జెండా వార్త ఈ వారం వచ్చిన మరో రెండు పెద్ద కథనా లను తోసిపారేసింది. ఒకటి: మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని దిగ్విజయంగా వెనక్కురావడం, ఆ దేశాలనుంచి ఆయన మనకు అనేక బహుమతులను (యుద్ధ విమానాలతో సహా) తీసుకువచ్చారు. రెండు: 56 రోజుల చింతన నుంచి బయటపడి రాహుల్ గాంధీ దేశంలోకి అడు గుపెట్టడం.



అయితే వీరిద్దరికంటే భారత్‌లో ప్రధాన వార్తాంశమైన వాడు జెండామనిషి మసరత్ ఆలమ్. ఇతడు కశ్మీర్ వేర్పాటు వాది. పాక్ జెండా పట్టుకున్నందుకు తనను మళ్లీ జైలుకు పం పారు. కశ్మీర్ పాలక పక్షాల మధ్య ఇంత పెద్ద చీలికను ఎంత సులభంగా తాను తేగలిగాడో, ఎంత సులువుగా తాను జాతీ య వార్తగా మారాడో చూసి ఆలమ్ పరమానందభరితుడై ఉంటాడు. ఇకపోగా కశ్మీర్ ముస్లింల పట్ల మృదువైఖరితో వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ సైతం మొదటిసారిగా తొడగొట్టి మరీ ఆలమ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై ఇండియా టుడే పత్రిక దిగ్విజయ్ ప్రకటనను నివేదించింది. ‘జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఏ చట్టం కింద మసరత్ ఆలమ్ సాహెబ్‌ను అరెస్టు చేసింది? ప్రభుత్వం దీనిపై తప్పక వివ రణ ఇవ్వాలి’ అని సింగ్ చెప్పారు. ‘ఆ సభలో వారి ప్రసం గాలు, వారి చేతలు దేశంపై యుద్ధాన్ని ప్రకటించినట్లే ఉన్నా యి. వారిని జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించాలని’ దిగ్విజయ్ పేర్కొన్నారు.



ఒక జెండాను ఎత్తిపట్టుకుంటేనే యుద్ధం చేసినట్లా? ఎలా? దిగ్విజయ్ సింగ్ శ్రుతిమించి చేసిన ప్రకటన, వ్యాఖ్య లలో అతిప్రధానమైన వ్యాఖ్యను ఇండియా టుడే పత్రిక పతాక శీర్షికగా పెట్టింది. అదేమిటంటే, ‘మసరత్ ఆలమ్‌ను సాహెబ్‌గా వర్ణించిన కాంగ్రెస్ నేత’. అయితే, భారత్‌లో మనం అపరిపక్వత, మూర్ఖత్వం మధ్య బంధితులమై ఉన్నా మని దీనర్థం కాదు. మన వృద్ధి రేట్లు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికస్థాయిలో ఉన్నాయి. ఈలోగా తాను పాకిస్తాన్ జెం డా పట్టుకున్నట్లు వచ్చిన వార్తను ఆలమ్ ఖండించినట్లు ది హిందూ పత్రిక నివేదించింది. జాతి వ్యతిరేక కార్యకలా పాలకు గాను చట్టవ్యతిరేక చర్యల (నివారణ) చట్టం కింద ఆరోపణకు గురైన ఒకరోజు తర్వాత, హురియత్ నేత తాను పాక్ జెండాను ఊపలేదని, దానికి తాను బాధ్యుడిని కాదని వివరణ ఇచ్చినట్లు ది హిందూ పేర్కొంది. ‘జిలానీ స్వాగత కార్యక్రమం జరిగింది. కొందరు యువకులు (పాకిస్తాన్) జెండాలు పట్టుకున్నారు. దానికి నేనెందుకు బాధ్యత వహించాలి?.’ దాదాపు నాలుగేళ్లపాటు ప్రజాభద్రత చట్టం కింద నిర్బంధంలో ఉండి 2015 ఏప్రిల్‌లో విడుదలైన ఆలమ్ ఇలా చెప్పారు. ‘ఇది ఒక వ్యక్తి చేసిన చర్యకాదు. రాష్ట్రంలోని సాధారణ పరిస్థితి ఇలాగే ఉంది. దీనికి ఒక వ్యక్తిని బాధ్యు డిని చేయడం సరైంది కాదని నేననుకుంటున్నాను.’

 ఆ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత 48 గంటల పాటు భారతీయ టెలివిజన్లు దీన్నే ప్రసారం చేస్తూపోయా యి. ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. మనం చాలా సులువుగా ఎవరికైనా విశ్వసనీయతను, సాధికారతను బహు మతిగా అందించగలమనే విషయాన్ని మనం గుర్తించడం లేదు. మీడియాలో చెలరేగిన ఈ నిర్వాకం కారణంగా ఆలమ్ ఈరోజు కశ్మీర్ వేర్పాటువాదుల్లోని అత్యంత వివాదరహిత నేతల్లో ఒకరుగా మారిపోయారు. అతడు చేసిందల్లా ఒక్కటే. ఎవరో ఒకరు తన చేతిలో జెండా పట్టుకునేలా చేశాడు. అత డు మనల్ని ఎంత నిర్దిష్ట స్థానంలో పడవేశాడంటే, ఇకనుంచి అనేక ఏళ్ల పాటు అతడు ఈ పని చేస్తూనే ఉంటాడు.



ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన అనంతరం, నేను ఒక విషయాన్ని పేర్కొన్నాను. మ్యాచ్ మధ్యలో క్రికెట్ ఆస్ట్రేలి యా చైర్మన్ వాలీ ఎడ్వర్డ్స్ ఇలా అన్నారు. ‘నా అభిప్రాయం ప్రకారం కీలకమైన విషయం ఏమిటంటే, ఆస్ట్రేలియాలోని వివిధ దేశాల కమ్యూనిటీ ప్రజలు తమ తమ జట్లకు మద్దతు తెలుపుతూ ముందుకురావడమే. ఆస్ట్రేలియాలో భారతీయ క్రికెట్ అభిమానుల మద్దతు నమ్మశక్యం కానంత స్థాయిలో ఉంది.’ తర్వాత ఆయన ఇలా అన్నారు. ‘తమ జట్టును సం తోషపెట్టేందుకు ఆస్ట్రేలియాలోని అన్ని ప్రాంతాల నుంచి బంగ్లాదేశీయులు తరలివస్తున్నారు.’



ఆయన ప్రకటనపై నేనిలా రాశాను. ‘ఈయన ఒక నాగ రిక దేశంలోని ఒక నాగరిక వ్యక్తి. భారత్‌లో బంగ్లాదేశీయుల గురించి బీసీసీఐ చైర్మన్ ఇలాంటి ప్రకటన చేయడాన్ని ఒక సారి ఊహించుకోండి మరి. వెంటనే క్రీడా మైదానంలోని ప్రతి ఒక్కరూ టార్చ్‌లు, పంగలకర్రలను తీసుకుని బంగ్లాదేశీ యులను గాలించడానికి వెళ్లేవారు. అర్నాబ్ గోస్వామి వారం దరికి ముందు నిలబడి ఉండేవాడు.’

 అదీ విషయం. మనం ఇక్కడే ఉన్నాం మరి.



ఆకార్ పటేల్

(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)  ఈమెయిల్: aakar.patel@icloud.com  




 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top