మా అనుమతి లేకుండా నియమించొద్దు


  • సీవీసీ, వీసీలపై కేంద్రానికి సుప్రీం ఆదేశం

  • న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ), విజిలెన్స్ కమిషనర్(వీసీ)లను నియమించే ముందు తమ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఎంపిక ప్రక్రియ గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. ‘‘ఎవరిని నియమించారన్నది మాకు అవసరం లేదు.



    కానీ తగిన పద్ధతిలో ఆ నియామకం జరిగిందా లేదా అన్నది చూడడమే మా కర్తవ్యం. ఇకపై మా అనుమతి లేకుండా ఆయన(అటార్నీ జనరల్) ఈ నియామకాల విషయంలో చర్యలు తీసుకోరని మేం విశ్వసిస్తున్నాం.


    మీరు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లడానికి ముందు మా దగ్గరకు రండి(అనుమతి కోసం)’’ అని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ.. సీవీసీ, వీసీల ఎంపిక ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతిచ్చింది.

     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top