'ప్రధానికి చదువు లేకపోయినా ఫర్వాలేదు.. కానీ'

'ప్రధానికి చదువు లేకపోయినా ఫర్వాలేదు.. కానీ' - Sakshi


న్యూఢిల్లీ: తక్షణమే ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టిరోజు వివాదంపై వివరణ ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. భారతదేశ ప్రధాన మంత్రి కార్యాలయానికి విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజును నిర్ధారణ చేసుకోవడానికి హై స్కూల్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్కు సంబంధించి సర్టిఫికెటన్లను ప్రధాని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. చదువు రాని ప్రధాన మంత్రి అయినా మాకు ఫర్వాలేదు, కానీ ప్రధాన మంత్రి తన విద్యార్హత, పుట్టిన తేదీ విషయంలో నిజాయితీగా లేకపోతే మాత్రం మేము సహించేది లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.





మోదీకి రెండు పుట్టినరోజులున్నాయని ఇందులో ఏది సరైందో ఆయనే చెప్పాలని గత కొంతకాలంగా మోదీపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. విస్‌నగర్‌లోని ఎమ్మెన్ కాలేజీ రికార్డుల్లో మోదీ పుట్టిన రోజు ఆగస్టు 29, 1949 అని నమోదై ఉండగా, ప్రధాని అధికారిక వెబ్‌సైట్లో మాత్రం సెప్టెంబర్ 17, 1950 ఉండటంలో తీవ్రవిమర్శలు వెల్లువెత్తాయి.

 


 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top