వ్యాపమ్ కుంభకోణంపై స్పందించిన సుప్రీంకోర్టు

వ్యాపమ్ కుంభకోణంపై స్పందించిన సుప్రీంకోర్టు - Sakshi


న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కుంభకోణానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ఈ నెల 9న విచారణ జరుపుతామని వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ కుంభకోణంలో అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై స్పందించిన కోర్టు అన్ని పిటిషన్లపై ఈ నెల 9న విచారణ జరుపుతామని మంగళవారం వెల్లడించింది.



మరోవైపు... వ్యాపమ్ మృత్యుపాశంగా మారుతోంది. నిందితులు, సాక్షుల వరుసమరణాలు పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా... కానిస్టేబుల్ రమాకాంత్ పాండే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మధ్య ప్రదేశ్‌ తికమ్‌ఘర్‌లో తన ఇంట్లో రమాకాంత్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. ఈ స్కామ్‌కు సంబంధించి ఎస్టీఎఫ్ అధికారులు పాండేను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒత్తిడి భరించలేకే కానిస్టేబుల్ ఉరి వేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి గత మూడు రోజుల్లో ఇది నాలుగో మృతి. నిన్న ట్రైనీ ఎస్ఐ అనామిక కుష్వాహా సాగర్ ట్రైనీ సెంటర్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలగా, అంతకుముందు టీవీ టుడే రిపోర్టర్ అక్షయ్‌సింగ్, జబల్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ అరుణ్ శర్మ అనుమానాస్వద స్థితిలో మృత్యువాత పడ్డారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top