బీజేపీ 'జైల్ భరో' మరోసారి వాయిదా


బీజేపీ 'జైల్ భరో' ఆందోళన కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఉత్తరాఖండ్ వరదలు నేపథ్యంలో 'జైల్ భరో'ను వాయిదా వేసినట్టు బీజేపీ తెలిపింది. యూపీఏ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మే 27 - జూన్ 2 మధ్య దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాలని బీజేపీ ముందుగా నిర్ణయించింది.

 


అయితే ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడితో వాయిదా వేసింది. ఈనెల 17 - 30 మధ్య 'జైల్ భరో' నిర్వహించాలని భావించింది.  ఉత్తరాఖండ్ లో ప్రకృతి  విలయంతో వందలాది మృతి చెందడం, వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో ఈ కార్యక్రమాన్న మరోసారి వాయిదా వేసింది. ఆందోళన బదులుగా ఉత్తరాఖండ్ లో వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top