120 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చు!

120 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చు!


న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు ఇక  120 రోజుల ముందేటికెట్లను రిజర్వేషను చేసుకోవచ్చు.  ప్రస్తుతం 60 రోజులు ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. రైళ్లలో సీట్లు, బెర్తులు 120 రోజులు ముందు రిజర్వు చేసుకునే అవకాశం కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.  తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమితి ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లు అడ్వాన్సు టికెట్ రిజర్వేషను విషయంలో ప్రస్తుతం ఉన్న విధంగానే (60 రోజులు) కొనసాగనుందని రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. విదేశీ పర్యాటకులకు అడ్వాన్సు రిజర్వేషన్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి 360 రోజుల గడువులో ఎలాంటి మార్పులేదని పేర్కొంది.


సీనియర్ సిటిజన్లు, మహిళలు, గర్భిణిలకు బెర్తులో కోటా



 రైళ్లలో ప్రయాణించే సీనియర్‌సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణిలకు బోగిలోని కింది బెర్తులను కోటా కింద కేటాయిస్తూ రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సీటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణీలకు  రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో స్లీపర్, 3 ఏసీ, 2 ఏసీల్లో కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానంలో ఆటోమెటిక్‌గా బెర్తులు కేటాయింపు జరుగుతుంది. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల సహాయకులకు మధ్య, లేదా అప్పర్ బెర్తులు కేటాయిస్తారు. సుదూర ప్రయాణం సాగించే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒక స్లీపర్ బోగీలో ఆరు బెర్తులను ఈ కోటా కింద కేటాయించనున్నారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top