నేటి వార్తల్లో ముఖ్యాంశాలు


బోరు బావిలో పడిన చిన్నారి మృతి

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో దాదాపు 60 గంటలపాటు ఎంతో శ్రమించినా ఫలితం శూన్యమైంది. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయాలని సిబ్బంది యత్నిస్తుండగా బోరు బావి నుంచి చిన్నారి అవశేషాలతో పాటు దుస్తులు(ఫ్రాక్) బయటకు వచ్చినట్లు తెలిపారు.



అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ

మూడుదేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పోర్చుగల్‌ చేరుకున్నారు. పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియో కోస్టాతో అంతరిక్షం, పర్యావరణంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై మోదీ విస్తృతంగా చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని ఆంటోనియో వెల్లడించారు. పోర్చుగల్‌ నుంచి శనివారం రాత్రి బయలుదేరిన ప్రధాని మోదీ ఆదివారం ఉదయం అమెరికాకు చేరుకున్నారు.



నేడు లక్నోకు రామ్‌నాథ్ కోవింద్

లక్నో: నేటి నుంచి రాష్ట్రాల్లో పర్యటించనున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్. నేడు లక్నోలో పర్యటన సందర్భంగా ఉభయ సభ్యులను కలుసుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్ధతు తెలపాలని కోరనున్న కోవింద్.



గుంటూరులో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ

నేడు గుంటూరులో బ్రాహ్మణ ఆత్మ గౌరవ సభ. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావు తొలగింపును వ్యతిరేకిస్తూ.. భవిష్యత్ కార్యచరణపై చర్చ. త్వరలో లక్షమంది బ్రాహ్మణులతో సభ నిర్వహిస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి



నేటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర

పూరీ: ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. శ్రీ క్షేత్రవాసుడైన పురుషోత్తముడు తన సోదరుడు బలభద్రుడు, సుభద్రలతో కలిసి భక్తుల మధ్యకు విచ్చేస్తారు. నేటి ఉదయం ఈ ముగ్గురు మూర్తులు పొహండిగా శ్రీ క్షేత్రం నుంచి బయటకు వచ్చి రథంపైకి చేరి ఊరేగనున్నారు. రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి యాత్రికులు భారీగా తరలివస్తున్నారు.



గోల్కొండ బోనాలు

గోల్కొండ: ఎంతో చారిత్రకమైన గోల్కొండ కోట బోనాల ఉత్సవాలు హైదరాబాద్‌లో నేడు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవాదాయశాఖ, ఆలయ ట్రస్టు బోర్డు, ఇతర సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబిక అమ్మవారి ఆలయాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.



తుది పోరుకు శ్రీకాంత్ సై

నేడు ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో రియో ఒలింపిక్ చాంపియన్ చెన్‌ లాంగ్ తో తలపడనున్న భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్. ఉదయం 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం



భారత్, వెస్టిండీస్‌ల రెండో వన్డే

నేడు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం



నేడు హాకీ వరల్డ్ లీగ్ సెమీస్

హాకీ వరల్డ్ లీగ్ సెమీస్ లో భాగంగా నేడు కెనడాతో ఢీకొననున్న భారత్. 5,6 స్థానాల కోసం ఈ పోరు. సాయంత్రం 4:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top