Alexa
YSR
‘జల ప్రాజెక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా పనిచేయాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం హైదరాబాద్కథ

నేటి వార్తా విశేషాలు

Sakshi | Updated: May 24, 2017 09:35 (IST)

శ్రీకాకుళంలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనశనివారం రెండోరోజు కొనసాగుతోంది. శుక్రవారం తొలిరోజున పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామం హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటారు.

సిక్కింలో రాజ్‌నాథ్ సింగ్
నేడు రెండోరోజు సిక్కింలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారు. నాథులాలో కొద్ది సమయం గడిపిన అనంతరం ఐటీబీపీ పోస్ట్ లాంచింగ్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్.

నేడు యాజమాన్య పీజీ వైద్య సీట్లకు నోటిఫికేషన్‌
హైదరాబాద్‌: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని పీజీ వైద్య యాజమాన్య, ఎన్నారై, ఇన్‌స్టిట్యూషన్‌ కోటా సీట్లకు శనివారం నోటిఫికేషన్‌ జారీకానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ప్రకటన విడుదల చేయనుంది. ప్రైవేట్‌ మెడికల్‌ పీజీ సీట్ల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే విధించడం, స్టే ఎత్తివేతకు కాలేజీలు పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ప్రైవేట్‌ కాలేజీలకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.

చిత్తూరు పర్యటనలో చంద్రబాబు
తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నేడు రెండోరోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం పులిచెర్ల మండలం అరవవాండ్లపల్లెలో పంట సంజీవని ఫాం ఫాండ్లను పరిశీలిస్తారు. రొంపిచెర్ల మండలం నగరి దళితవాడలో నిర్మించిన పక్కాగృహాలు, మరుగుదొడ్లు తదితరాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎస్వీయూలోని లైబ్రరరీ బ్లాక్‌ వద్ద అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తారు. శ్రీపద్మావతి అతిథి గృహంలో రాత్రిబస చేస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు.

మరో నాలుగు రోజులు వడగాడ్పులు
హైదరాబాద్: వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోహిణీ కార్తె దగ్గర పడుతుండటంతో ఎండలు మండిపోతు న్నాయి. శుక్రవారం నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వడదెబ్బతో శుక్రవారం 20 మంది మృత్యువాత పడ్డారు.

ఉత్తరాఖండ్‌లో పునరుద్ధరణ పనులు
భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం నిలిచిపోయిన చార్‌ధామ్‌ యాత్రను మళ్లీ ప్రారంభించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. మూసుకుపోయిన రిషికేశ్-బద్రినాథ్ రహదారి పునరుద్ధరణకు పనులు వేగవంతం చేశారు.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అమలు చేసేదెట్లా?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC