పొగాకు రహిత గ్రామంగా థుట్రా


 సాక్షి, ముంబై : చంద్రాపూర్ జిల్లా థుట్రా గ్రామం పొగాకు రహిత గ్రామంగా రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నిలిచింది. ఈ గ్రామం ధూమపాన  రహిత (స్మోక్‌లెస్) గ్రామంగా పేరు గ డించింది. 2007లో ‘సలామ్ ముంబై ఫౌండేషన్’ అనే ఓ సామాజిక సంస్థ ఈ గ్రామంలో ధూమపాన వ్యతిరేక ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారానికి ప్రభావితమైన గ్రామ వాసులు ఇప్పుడు ధూమపానానికి దూరంగా ఉంటున్నారు.



ఇది ఒక అద్భుత ప్రక్రియగా సంస్థ పేర్కొంది. ఈ గ్రామంలో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా పొగాకు ఉత్పత్తులకు బానిసలయ్యారని సంస్థ తెలిపింది. ఇప్పుడు  పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంది.  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఈ గ్రామం ఆద ర్శంగా నిలవనుందని ఎస్‌ఎంఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ దీపక్ పాటిల్ పేర్కొన్నారు.  



వివరాలు ఆయన మాటల్లోనే...

 2007లో ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గ్రామస్తులు పొగాకుపై ఆధారపడి ఉన్నారు. పొగాకును నమలడం, గుట్కా తినడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం వారికి సర్వ సాధారణమైపోయింది. వీరు బహిరంగంగా కూడా పొగ తాగేవారు  సాయంత్రం వేళలో చాలా మంది మహిళలు ఒకే చోట చేరి పొగాకును సేవిస్తారు. చిన్నారులు కూడా పొగాకు ఉత్పత్తులను సేవించడం తమను ఆశ్చర్యానికి లోను చేసింది. ఇవన్నీ గమనించిన తాము ఓ ప్రణాళిక ప్రకారం వీరిలో మార్పు తీసుకొచ్చాం.



 పలువురి సాయం

 తాము గ్రామ ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది సహాయం కూడా తీసుకున్నాం. పొగాకు సేవించడం ద్వారా వచ్చే అనర్థాలను క్షుణ్ణంగా బోధించాం. పొగాకు సేవించని పాఠశాల, గ్రామంగా తీర్చి దిద్దేందుకు వీరిలో అవగాహన పెంపొందించేందుకు ఇందుకు సంబంధించి అక్కడక్కడ పోస్టర్లను కూడా వేశాం. పొగాను సేవించడం ద్వారా కలిగే దుష్పరిణామాలను ఇంటిఇంటికి వెళ్లి ప్రచారం చేశాం. వీటి వల్ల కలిగే అనర్థాలను కూడా వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా చూయించాం. అంతేకాకుండా వైద్య సిబ్బంది కూడా వీరిలో మార్పు తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వివిధ రకాల కార్యకలాపాలతో వివరించేవారు. టీవీ షోలు, ర్యాలీలు, వీధి నాటకాలు తదితర వాటి ద్వారా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను వివరించేవారు.



 అంగన్‌వాడీ సేవకులు, సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ, గ్రామ స్థాయి కమిటీ తదితరులు సహాయం కూడా తీసుకున్నాం. ఈ గ్రామంలో పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణ దారులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున నష్టం వచ్చింది. వారికి ఆర్థికంగా పెద్ద దెబ్బే తగిలింది. ఇది మొదటి విజయంగా తాము భావించాం.  ఈ విషయంలో గ్రామ ఉప సర్పంచ్ వామన్ భివాపూర్ కీలక పాత్ర పోషించారు. ఇతను మొదటగా ఇక్కడి పాఠశాలను పొగాకు రహితంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో పూర్తి సహకారం అందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top