ఫోర్జరీ కేసులో లాయర్ సహా ముగ్గురి అరెస్ట్


ముంబై : సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ షాపు యజమానిని మోసం చేయాలని ప్రయత్నించిన కేసులో ఓ లాయర్ సహా ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. ఇన్స్పెక్టర్ ఎస్ ఎస్ గరుడ్ కథనం ప్రకారం... లాయర్ ఉమేష్ పి చారి, ఎస్టేట్ ఏజెంట్ ఎల్డీ నాయక్, మరో వ్యక్తి సావంత్ లు కలిసి తన ఆస్తిని కొట్టేయాలని పథకం వేశారని కళాచౌకి నివాసి ప్రమోద్ దమాన్కర్ ఫిర్యాదు చేశాడు. నిందితులు తన షాపును సొంతం చేసుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించారని బాధితుడు ప్రమోద్ ఆరోపించాడు. షాపును అమ్మివేసినట్లుగా పత్రాలు నిందితుల వద్ద గుర్తించామని డీసీపీ అశోక్ దుడే వెల్లడించారు.



బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసుపై విచారణ చేపట్టగా, లాయర్ సహా మరో ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని తేలిందని డీఎస్పీ వివరించారు.  వాటి సాయంతో షాపు యజమాని ఆస్తిని లాగేసుకోవాలని నిందితులు భావించినట్లుగా తెలుస్తోంది. సాక్షి సంతకాలు చేసిన మరికొందరిపై కూడా తాము చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సంతకాలు చేసిన వారికి అవి నకిలీ పత్రాలు అని తెలుసో లేదో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గరుడ్ పేర్కొన్నారు. జూలై 4 వ తేదీ వరకు నిందితులు పోలీసు కస్టడీలోనే ఉంటారని, వారిపై ఫోర్జరీ, చీటింగ్ వంటి అంశాలలో ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top