కాంగ్రెస్ చరిత్రలో అవి మాయని మరకలు


ఎమర్జెన్సీ, బ్లూ స్టార్‌లపై కేంద్రమంత్రి జైట్లీ ధ్వజం



 న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి 41 ఏళ్లయిన సందర్భంగా కేంద్ర  మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పార్టీపై ఫేస్‌బుక్‌లో విమర్శలు చేశారు. ఎమర్జెన్సీతో పాటు స్వర్ణదేవాలయంలోఆపరేషన్ బ్లూస్టార్ కాంగ్రెస్ చరిత్రలో మాయని మరకలన్నారు. సంస్కరణలను కాంగ్రెస్  20 ఏళ్లు  ఆలస్యం చేసిందని, వారసత్వ ప్రజాస్వామ్యానికి చిరునామాగా భారత్‌ను మార్చేసిందంటూ పోస్టు చేశారు. దేశాన్ని అవినీతిలో కూరుకునేలా చేసిందంటూ విమర్శించారు.



 మోదీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్

 మరోవైపు.. ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మోదీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని పార్టీ  ప్రతినిధి టామ్ వడక్కన్ విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ప్రజాస్వామ్యం అణిచివేతకు ఉదాహరణలన్నారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు రావొచ్చన్న బీజేపీ నేత అద్వానీ వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలన్నారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top