విద్యార్థినిపై లైంగిక వేధింపులు:టీచర్ అరెస్ట్


బెలాగవి:మహిళలు, టీనేజ్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ టీచర్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నఘటన సోమవారం వెలుగు చూసింది.


 


కర్ణాటక రాష్ట్రంలో బెలాగవి పోలీస్ స్టేషన్ పరిధిలోని మరాఠీ ప్రైమరీ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై టీచర్ గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీనిలో భాగంగానే మరోసారి ఆ బాలికపై వేధింపులకు పాల్పడుతుండటంతో అతని దేహశుద్ధి చేసిన గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top