నెట్ వినియోగదారుల్లో తమిళ తంబీలే నం.1

నెట్ వినియోగదారుల్లో తమిళ తంబీలే నం.1

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నవారిలో తమిళ తంబీలు నంబర్ వన్ స్థానంలో నిలిచారు. దేశం మొత్తంలో నెట్ వినియోగదారుల సంఖ్య 23.10 కోట్లు ఉండగా వారిలో సుమారు 9 శాతం మంది తమిళనాడుకు చెందిన వారేనని తాజా గణాంకాల ద్వారా స్పష్టమైంది. రెండు కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా, 1.97 కోట్ల మందితో న్యూఢిల్లీ, 1.96 మందితో మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో నిలిచాయి. 1.7 కోట్ల మంది నెట్ యూజర్లతో కర్ణాటక నాలుగో స్థానం దక్కించుకుంది. 

 

అయితే ఇవన్నీ పట్టణ వినియోగదారులకు సంబంధించిన గణాంకాలు. గ్రామీణ ప్రాంతాలకొచ్చేసరికి యూపీ మొదటిస్థానంలో నిలిచింది. మన తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల మంది గ్రామీణ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు భారత టెలీకంశాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ‘భారత్ నెట్’ ప్రాజెక్ట్ అనే పేరుతో మార్చి 2017 నాటికి లక్ష గ్రామపంచాయితీ పరిధిలో నెట్ విస్తృతిని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top