జూన్‌ 17లోగా ముసాయిదా


- తుది మార్గదర్శకాలు మేం ఖరారు చేస్తాం

- న్యాయాధికారుల విభజనపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు




సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉండాల్సిన సబార్డినేట్‌ జ్యుడీషియల్‌ అధికారుల సంఖ్యను నిర్ధారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు రూ పొందించిన క్యాడర్‌ విభజన మార్గదర్శకాలను ముసాయి దాగా పరిగణించాలని, వీటిపై తగిన సూచనలు తీసుకుని కేంద్రం జూన్‌ 17లోగా మార్గదర్శకాల ముసాయిదాను త యారు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాను పరిశీలించి తుది మార్గదర్శకాలను తాము ఖరారు చేస్తామని చెబు తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యా యాధికారుల విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం 3 రోజులుగా విచారణ జరిపి శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది.



వివాదాన్ని పరిష్కరించే ప్రక్రియ ఇలా...

న్యాయాధికారుల కేటాయింపునకు సంబంధించి దాఖలైన రిట్‌ పిటిషన్, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లు విభిన్నమైన ప్రశ్నల ను లేవనెత్తాయని, ఆయా అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇక  వాద ప్రతివా దులకు ఈ ప్రక్రియలో భాగంగా కోర్టు  3 సూచనలు చేసింది.

► అవతరణ తేదీని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి 2 రాష్ట్రాల్లో జ్యుడీషియల్‌ అధికారుల క్యాడర్‌ ఎంత ఉండాలో తేల్చేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించి క్యాడర్‌ సంఖ్యను నిర్ధారించాలి.

► ఈ కసరత్తు నేటి నుంచి నాలుగు వారాల్లో పూర్తవ్వాలి.

► క్యాడర్‌ సంఖ్యను నిర్ధారించిన మీదట, విభిన్న క్యాడర్‌లకు సంబంధించిన అధికారుల కేటాయింపునకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి.

న్యాయాధికారుల కేటాయింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలపై తెలంగాణ జడ్జెస్‌ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సూచ నలు చేయాలని తలచాయని, మరో రకంగా చెప్పాలంటే హైకోర్టు మార్గదర్శకాలు వారికి అంగీకారం కాదని ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అంగీకరించిందని పేర్కొంది.



ఇటీవలి నియామకాలపై...

అవతరణ తేదీ అనంతరం ఉమ్మడి హైకోర్టు.. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌కు సంబంధించి 130 మంది సివిల్‌ జడ్జెస్‌ నియామకాలు జరిపిందని, ఇలా నియమితులైన వారికి సంబంధించి కేటాయింపుల విషయంలో కూడా తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఈ ప్రక్రియ జూన్‌ 30 లోపు పూర్తవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top