పేర్లు బయటకు రావడం కష్టమే

పేర్లు బయటకు రావడం కష్టమే - Sakshi


నల్లకుబేరుల పేర్లు ఇప్పట్లో అధికారికంగా బయటకు వచ్చేలా లేవు. తాము కూడా ఈ జాబితాలను తెరవబోమని, కేవలం సిట్కు మాత్రమే అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సిట్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు మాత్రమే ఈ 627 మంది జాబితాను చూడగలిగే అధికారం ఉంటుంది. తనంతట తానుగా ఈ జాబితాను బయటపెట్టలేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పారు. దీంతో అధికారికంగా ఈ పేర్లు బయటపడే అవకాశం ఇప్పట్లో లేనట్లే. ఒక కంపెనీతో సహా ఎన్డీయే ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఎనిమిది పేర్లు మాత్రమే ప్రస్తుతానికి తెలిసినట్లు.



ఇక ఈ కేసు దర్యాప్తును ఇప్పటికే సిట్కు అప్పగించిన సుప్రీంకోర్టు.. తాజాగా కేంద్రం సమర్పించిన జాబితాను కూడా ఇచ్చింది. ఈ మొత్తం అంశంపై ఓ స్థాయీ నివేదికను నవంబర్ నెలాఖరుకు సమర్పించాలని సిట్ను సుప్రీం ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top