మెరుగవుతున్న సోనియా ఆరోగ్యం
న్యూఢిల్లీ: శ్వాసకోస సమస్యలతో చికిత్స పొందుతున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. సోనియా శ్వాసకోసకు సంబంధించి పరీక్షలు నిర్వహించామని, ఎలాంటి సమస్యా లేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమెను నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్టు చెప్పారు.