మీరెవరు? కులం, ఆర్థిక స్థితిగతులేంటి?

మీరెవరు? కులం, ఆర్థిక స్థితిగతులేంటి? - Sakshi


న్యూఢిల్లీ: పేరు.. చిరునామా.. కుటుంబం.. కులం.. ఆర్ధిక, సామాజిక స్థితిగతులు.. ఇలా ఒక్కటేమిటి దేశ పౌరులకు సంబంధించిన పరిపూర్ణ వివరాలతో కూడిన 'సామాజిక ఆర్థిక కుల గణన (సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్) ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదలచేసింది. స్వాతంత్ర్యం తరువాత ఇలాంటి నివేదికను రూపొందించడం ఇదే ప్రథమం కావడం విశేషం.



ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్, పలువురు ఉన్నతాధికారులు ఈ నివేదికను విడుదలచేశారు. వీటి ఆధారంతో దేశ గమనాన్ని నిర్దేశిస్తాయని జైట్లీ అన్నారు. రిపోర్టుకు సంబంధించిన ముఖ్యాంశాలు కొన్ని..


  • స్వాతంత్ర్యానంతరం సామాజిక, ఆర్థిక, కుల గణన చేపట్టడం ఇదే మొదటిసారి

  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2011లో గణన ప్రక్రియ మొదలైంది

  • సర్వేచేసిన మెత్తం జిల్లాలు - 640

  • దేశంలోని మొత్తం కుటుంబాల సంఖ్య- 24.39 ¤¥Ööþœ

  • గ్రామాలలో ఉంటూ ఆదాయం పన్ను చెల్లిస్తోన్నవారు- 4.6 శాతం మంది

  • ఎస్సీ కులాల్లో ఆదాయం పన్ను చెల్లిస్తోన్నవారు- 3.49 శాతం మంది

  • ఎస్టీల్లో పన్ను చెల్లింపుదారులు- 3.34 శాతం మంది

  • తెలంగాణలో మొత్తం కుటుంబాల సంఖ్య- 83,06,764

  • తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల సంఖ్య-  57,06,101

  • తెలంగాణ పట్టణాల్లో నివసించే కుటుంబాల సంఖ్య-  26,00,645

  • ఏపీలో మొత్తం కుటుంబాల సంఖ్య- 1,22,23,095

  • ఏపీ గ్రామీణ ప్రాంతంలో నివసించే కుటుంబాల సంఖ్య- 92,97,011

  • ఏపీ పట్టణాల్లో నివసించే కుటుంబాల సంఖ్య- 29,26,084

  • ప్రస్తుతం దేశంలోని పౌరుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో సమగ్ర వివరాలను పొందుపర్చారు

  • తద్వారా భవిష్యత్లో ఏయే రంగాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయాలపై స్పష్టత వస్తుంది
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top