ఆజంఖాన్ను పీకి పారేయండి.. షియాల డిమాండ్

ఆజంఖాన్ను పీకి పారేయండి.. షియాల డిమాండ్


ఉత్తరప్రదేశ్లో వక్ఫ్బోర్డు నియామకాలలో నెలకొన్న గందరగోళాన్ని సరిచేయాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను అక్కడి షియాలు కోరారు. మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, వక్ఫ్ శాఖలను నిర్వహిస్తున్న ఆజంఖానే ఈ గందరగోళానికి కారణమని, ఆయనను మంత్రిపదవి నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడైన ఆజంఖాన్ అనధికారికంగా యూపీ కేబినెట్లో నెంబర్ 2గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. షియా మతగురువు కల్బే జవ్వాద్ ముఖ్యమంత్రి అఖిలేష్ను కలిసి ఈ విషయంలో తమ వాదన తెలిపారు.



వక్ఫ్ బోర్డులో నియమితులైన వాళ్లు అవినీతిపరులని, వాళ్లు భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని కల్బే జవ్వాద్ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే సమాధానం కావాలని చెబుతూ తమ ఐదు డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ముందుగా వక్ఫ్ శాఖను ఆజంఖాన్ నియంత్రణ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top