రూ. 200కోట్ల లావాదేవీల్లో రాజా, కనిమొళి అక్రమాలు


కళైనార్ టీవీకి సొమ్ము బదిలీ, ప్రత్యేక కోర్టుకు ఈడీ నివేదన

 

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోని మనీ ల్యాండరింగ్ అభియోగాల కేసులో నిందితులైన మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళి దాదాపు రూ. 200 కోట్ల మేర లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢి ల్లీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. రాజా, కనిమొళిలపై దాఖలైన మనీ లాండరింగ్ అభియోగాలపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ మంగళవారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. డీబీ గ్రూప్ కంపెనీనుంచి కనిమొళి గ్రూపు కంపెనీనుంచి వివిధ కంపెనీల ద్వారా డీఎంకే యాజమాన్యంలోని కలైనార్ టీవీకి జరిపిన రూ 200 కోట్ల మేర బదిలీలో నిబంధలను పాటించలేదని ఆనంద్ గ్రోవర్ కోర్టుకు తెలిపారు.



ఈ లావాదేవీల్లో కుసేగావోన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సినీయుగ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కేవలం డబ్బు బదిలీకోసమే వినియోగించారన్నారు. కాగా, 2జీ కేసులోనే ఈడీ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్ సింగ్ సహా మరి కొందరిని సాక్షులుగా పిలిపించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందించేందుకు తమకు మరి కొంత వ్యవధి ఇవ్వాలని రాజా, కనిమొళి సహా 15మంది నిందితులు ప్రత్యేక కోర్టును కోరారు. దీంతో కోర్టు కేసు విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.



బొగ్గు స్కామ్‌పై తుది తీర్పు నేడే



 అక్రమమని సుప్రీంకోర్టు పేర్కొన్న 218 బొగ్గు గనుల కేటాయింపుల భవితవ్యం నేడు తేలనుంది. వాటికి సంబంధించిన తుది తీర్పును బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఆగస్ట్ 25న ఆ   కేటాయింపులను తీవ్రంగా ఆక్షేపిస్తూ పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని వాటిని రద్దు చేయడంలేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top