ఇండియన్ రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ

ఇండియన్ రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ


న్యూ ఢిల్లీ:

బైక్ లవర్స్ను ఆకర్షిస్తూ యూత్ ఐకాన్గా నిలిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కు సంబంధించి మరో వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగానే ఫీచర్స్ను అప్ డేట్ చేస్తూ కొత్త బైక్లను తయారు చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్లో కొత్తగా రానున్న కాంటినెంటల్ జీటీ 750సీసీ బైక్పై భారీ అంచనాలే ఉన్నాయి. ట్విన్ సిలిండర్ కలిగిన ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ను ఇండియన్ రోడ్లపై పరీక్షిస్తున్నట్టు సమాచారం. స్పెయిన్, యూకేలో మొదటగా టెస్ట్ చేసిన అనంతరం ఇప్పుడు భారత్లో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతోంది.



రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 750సీసీని బీఎస్-4 ఎమిషన్ నార్మ్స్కు తగ్గట్టుగా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జీటీ 750సీసీలో ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోల ప్రకారం 750సీసీ ఎయిర్ కూల్డ్ ట్విన్ సిలిండర్లతో పాటూ రెండు సైలెన్సర్లు కూడా ఉన్నాయి. జీటీ 750 ఇంజిన్ విషయానికి వస్తే 50పీఎస్ ఆఫ్ పవర్ సామర్థ్యంతో తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న జీటీ 535 ఇంజిన్ సామర్థ్యం 29పీఎస్ మాత్రమే. కాంటినెంటల్ జీటీ 750సీసీలో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)ను వాడినట్టు సమాచారం. రోడ్ సేఫ్టీ ప్రమాణాలకు సంబంధించి పరీక్షల్లో సఫలమైతే, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో దీనిపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top