'నిర్భయ డాక్యుమెంటరీ ప్రసారంపై నిషేధం ఎత్తివేయండి'


న్యూఢిల్లీ: ‘నిర్భయ’ గ్యాంగ్ రేప్ ఘటన ఆధారంగా రూపొందిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ ప్రసారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి భారత ఎడిటర్స్ గిల్డ్  విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కాదని బీబీసీ ఆ డాక్యుమెంటరీని భారత్ మినహా పలు దేశాల్లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే.


 


బాధిత స్త్రీ కుటుంబం అనుభవించిన క్షోభ, ప్రదర్శించిన తెగువ, వివేచన, పురోగామి దక్పథాన్ని ఆ డాక్యుమెంటరీ అద్భుతంగా చూపిందని.. అలాంటి డాక్యుమెంటరీని నిషేధించడం సరికాదని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. అంతేకాకుండా, ఆ ఘటనలో దోషి అయిన ముకేశ్ సింగే కాకుండా, చదువుకున్నవారు, న్యాయవాదులు.. మహిళలపై వ్యక్తం చేసిన సిగ్గులేని వైఖరిని తేటతెల్లం చేసిందని గిల్డ్ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top