ఓట్ల లెక్కింపులో మార్పులకు కేంద్రం తిరస్కారం


న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు బయటకు కనిపించకుండా... తుది ఫలితాన్ని ఒకేసారి ’టోటలైజర్‌‘ యంత్రం ద్వారా వెల్లడించాలన్న ఈసీ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది.


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం ఆ మేరకు నిర్ణయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీకి తెలిపింది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ఈవీఎంలకు టోటలైజర్‌ మిషన్ ను అనుసంధానం చేస్తారు. దీంతో తుది ఫలితం మాత్రమే వెల్లడవుతుంది. బూత్‌ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్న వివరాలు తెలియవు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top