జనధన యోజన ప్రారంభం


జనధన యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం 76 కేంద్రాల్లో ఈ పథకం ఒకేసారి ప్రారంభమైంది. ప్రతి కుటుంబానికి కూడా బ్యాంకు ఖాతా ఉండటం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. జీరో బ్యాలెన్స్తో ప్రారంభించే ఈ ఖాతాలు ఉన్న కుటుంబాలకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ప్రధానమంత్రి ఇంతకుముందే ప్రకటించారు.



దీనివల్ల ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటుంబం కష్టాల పాలు కాకుండా ఈ మొత్తం ఆదుకుంటుందని అంటున్నారు. తొలి రోజున కోటి మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మార్గదర్శకాలు రూపొందించారంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు వస్తుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top