మధ్యప్రదేశ్‌ మంత్రిపై వేటు

మధ్యప్రదేశ్‌ మంత్రిపై వేటు - Sakshi


న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ సీనియర్‌ మంత్రి నరో త్తమ్‌ మిశ్రాపై ఎన్నికల సంఘం (ఈసీ) అనర్హత వేటు వేసింది. పెయిడ్‌ న్యూస్‌ అభియోగాలపై, ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలను చూపించారని పేర్కొంటూ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దటియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక కూడా చెల్లదని స్పష్టం చేసింది. శనివారం నుంచి మూడేళ్లపాటు మిశ్రాను అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి నసీమ్‌ జైదీ, ఎన్నికల కమిషనర్లు ఏకే జోటీ, ఓపీ రావత్‌లతో కూడిన ఎన్నికల సంఘం ధర్మాసనం.. 69 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.



ఈసీ నిర్ణయంతో మిశ్రా మూడేళ్లపాటు ఎన్ని కల్లో పోటీ చేసేందుకు అనర్హులు. 2008 అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా తన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీ ముందుంచలేదని ఆరో పిస్తూ 2009లో కాంగ్రెస్‌ నేత రాజేంద్ర భారతి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. 2013 జనవరి 15న మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులను సవాలు చేస్తూ మిశ్రా మధ్య ప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు అనుకూల ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈసీ తన తీర్పు వెలువరించింది.



మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. ఈసీ వెలువరించిన తీర్పు 2008 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదని, తాను 2013లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తీర్పు చెల్లదని పేర్కొన్నారు. ప్రస్తుత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంత్రివర్గంలో నీటివనరులు, ప్రజా సంబంధాల శాఖల మంత్రిగా మిశ్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  ఎన్నికల సంఘం నిషేధం విధించినందున నరోత్తమ్‌ మిశ్రా మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ‘బీజేపీ మంత్రులు ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారో నిరూపితమైంది’ అని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ అన్నారు.


మధ్యప్రదేశ్‌ మంత్రిపై వేటు


 


  మూడేళ్లపాటు అనర్హుడిగా ప్రకటించిన ఈసీ


∙రాజీనావ] ూకు కాంగ్రెస్‌ డిమాండ్‌


 


న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ సీనియర్‌ మంత్రి నరో త్తమ్‌ మిశ్రాపై ఎన్నికల సంఘం (ఈసీ) అనర్హత వేటు వేసింది. పెయిడ్‌ న్యూస్‌ అభియోగాలపై, ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలను చూపించారని పేర్కొంటూ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దటియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక కూడా చెల్లదని స్పష్టం చేసింది. శనివారం నుంచి మూడేళ్లపాటు మిశ్రాను అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి నసీమ్‌ జైదీ, ఎన్నికల కమిషనర్లు ఏకే జోటీ, ఓపీ రావత్‌లతో కూడిన ఎన్నికల సంఘం ధర్మాసనం.. 69 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్ణయంతో మిశ్రా మూడేళ్లపాటు ఎన్ని కల్లో పోటీ చేసేం దుకు అనర్హులు. 2008 అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా తన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీ ముందుంచలేదని ఆరో పిస్తూ 2009లో కాంగ్రెస్‌ నేత రాజేంద్ర భారతి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. 2013 జనవరి 15న మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులను సవాలు చేస్తూ మిశ్రా మధ్య ప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు అనుకూల ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈసీ తన తీర్పు వెలువరించింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. ఈసీ వెలువరించిన తీర్పు 2008 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదని, తాను 2013లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తీర్పు చెల్లదని పేర్కొన్నారు. ప్రస్తుత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంత్రివర్గంలో నీటివనరులు, ప్రజా సంబంధాల శాఖల మంత్రిగా మిశ్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  ఎన్నికల సంఘం నిషేధం విధించినందున నరోత్తమ్‌ మిశ్రా మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ‘బీజేపీ మంత్రులు ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారో నిరూపితమైంది’ అని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ అన్నారు.


Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top