Alexa
YSR
‘పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్యరంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

‘మోదీని చూసి మీడియా భయపడుతోంది’

Others | Updated: February 17, 2017 17:25 (IST)
‘మోదీని చూసి మీడియా భయపడుతోంది’

లక్నో: చాన్నాళ్లకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూతురు ప్రియాంకగాంధీ సోదరుడు కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతో కలసి రాయ్‌బరేలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనంతరం వేదికను పంచుకున్నారు. రాహుల్‌ గాంధీ  ఎప్పటిలాగే ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మంచి రోజులు ఏవి అని ప్రశ్నించారు. ప్రధాని ధనికులకే మేలు చేస్తున్నారని మండిపడ్డారు.

రైతు రుణాలు మాఫీ చేయడం లేదుగానీ, మల్యాకు రూ.9వేల కోట్లు ఇచ్చి పారిపోయేలా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల రుణాలు రద్దు చేయాలని, కరెంటు బిల్లులు చెల్లించాలని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఒక్క పేదవాడు మాత్రమే క్యూలో నిల్చున్నాడని, ఒక్క ధనికుడినైనా చూపించారా అని నిలదీశారు. ఎక్కడికి వెళ్లినా మోదీ హామీలు ఇస్తారే తప్ప చేసేది ఏమీ ఉండదని అన్నారు.

మోదీని చూసి మీడియా భయపడుతుందని, అందుకే ఆయన చెప్పే అబద్ధాలను ప్రజలకు తెలియజేయడం లేదని ఆరోపించారు. మోదీని షోలే సినిమాలో గబ్బర్‌ సింగ్‌తో పోలుస్తూ రెండేళ్ల తర్వాత యూపీలోకి గబ్బర్‌ సింగ్‌ వచ్చారని విమర్శించారు. ఆయన బెనారస్‌ వెళ్లి తాను గంగా పుత్రుడిని అని చెప్పుకున్నారని, తాజాగా వారణాసి దత్తపుత్రుడినని అంటున్నారని విమర్శించారు. ఆరు లక్షల కోట్ల రూపాయలను 50మంది కోటీ శ్వరులకు ఇచ్చారని కానీ పేదలకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

సాగు యజ్ఞం

Sakshi Post

Websites Of DU, AMU, IIT-Delhi Hacked

The hacked websites belong to prestigious universities

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC