ఉల్లి.. తల్లడిల్లి...

ఉల్లి.. తల్లడిల్లి...


- కిలో ఉల్లి 50 పైసలే..  దారుణంగా పడిపోయిన ధర

- ఉసూరుమంటున్న ఉల్లి రైతులు

 

 హైదరాబాద్: గత ఏడాది ఆకాశాన్నంటిన ధరతో కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. దీంతో కిలో ఉల్లి ధర రూ.5 నుంచి 50 పైసలకు తగ్గిపోయింది. ఉల్లి దిగుమతి పెరగడం వల్ల ఒక్కసారిగా ధరలు పడిపోవడం ఉల్లి రైతులకు శాపంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్ నుంచి వారం రోజులుగా నిత్యం 25 వేల నుంచి 32 వేల బస్తాల వరకు ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ఉల్లి ధరలు కిలో రూ.5 నుంచి 50 పైసల వరకు తగ్గింది. దీంతో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మూడో రకం ఉల్లిని క్వింటాకు రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నారు.



మరోవైపు మార్కెట్‌లో ఉల్లిని నిల్వ చేసేందుకు తగిన స్థలం దొరక్కపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహా రాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుబడి అరుున ఉల్లి రూ.5 నుంచి రూ.10 వరకు(మొదటి రకం) ధర పలికింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన మొదటి రకం ఉల్లిని ప్రభుత్వం క్వింటాకు రూ.800 నుంచి రైతుల వద్ద కొనుగోలు చేస్తోంది. రెండో రకం ఉల్లిని రూ.500, రూ.300, రూ.200 వరకు కొనుగోలు చేస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో 31 వేల బస్తాల ఉల్లి దిగుమతి అరుునా క్వింటాకు రూ.3 వేలు, కిలో రూ.30 లెక్కన అమ్మకాలు జరిగారుు. దీంతో రైతులు ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో ఉల్లి పంట విపరీతంగా వేశారు. అయితే ఈ ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడంతో కొనుగోలు ధర తగ్గిపోరుు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గిట్టుబాటు ధర లేక మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఉల్లి నిల్వలను పారబోశారు. కాగా, వర్షాలు ఎక్కువగా పడటం, ఉల్లి నిల్వ లేకుండా కుళ్లిపోవటం తదితర కారణాల వల్లే ఈ ఏడాది ఎక్కువ ధర రాలేదని అధికారులు చెపుతున్నారు.

 

 అధిక దిగుబడే ధర తగ్గడానికి కారణం

 ఉల్లి దిగుబడి పెరగడం.. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎక్కువగా రావటం, పచ్చి ఉల్లి తీసుకురావటం మొదలైనవి ఉల్లి ధర తగ్గుదలకు కారణమని, దీనికి తోడు వర్షాలు భారీగా కురవటం కూడా ప్రభావం చూపిందని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ అసిస్టెంట్ ఎస్‌జీఎస్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అరుుతే ప్రభుత్వ ఆదేశానుసారం రైతులకు ఇబ్బందులు లేకుండా ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top