రోడ్డు పై కార్ వాష్ చేస్తే.. ఫైన్ పడుద్ది!


బరేలీ: రోడ్డు మీద కారు కడగాలని చూస్తున్నారా? అయితే 5 వేల రూపాయల ఫైన్ కట్టాల్సిందే.  ఉత్తరప్రదేశ్ లోని బరేలీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఆదేశాలు జారీ చేయాలని ఆలోచిస్తోందట. స్థానికంగా ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో చాలామంది తమ కార్లను రోడ్లపైనే కడుగుతున్నారని, అందుకే సిటీలోని రోడ్లన్నీ పాడైపోతున్నాయని తేలిందట. తారు రోడ్డు మీద నీళ్లు నిల్వ ఉంటే ఆ రోడ్డు రోడ్ల పక్కన నీళ్ళు చేరడం మూలంగానే  రోడ్లు పగుళ్ళు వస్తున్నాయని సర్వే తేల్చింది.


దీనితో బరేలీ మున్సిపల్ కమిషనర్ శీలధర్ యాదవ్    కొరడా ఝుళిపించేందుకు రడీ  అవుతున్నారు. తమ ఇలా రోడ్లపై కార్లు కడిగే వారిపై నిర్దాక్షిణ్యంగా  జరిమానా విధిస్తామని తెలిపారు. అవసరమైతే ఈ జరిమానాను పెంచే ఆలోచన కూడా  చేస్తున్నామని నగర మేయర్ ఎస్. తోమర్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top