పేరుకే పోటీ!

పేరుకే పోటీ!


యూపీఏ, ఇతర విపక్షపార్టీలు మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. వామపక్షాలు చెప్పినట్లు ఇది సైద్దాంతిక పోటీయే తప్పితే... ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయమని అంకెలు చెబుతున్నాయి. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం ఓట్ల విలువ 10,98,903. దీంట్లో సగంకన్నా ఒక ఓటు ఎక్కువ (5,49,452 ఓట్లు) వచ్చిన వారు గెలుస్తారు. మొత్తం ఓట్ల విలువను 100 శాతంగా తీసుకొని... ఏయే కూటమికి ఎంత శాతం ఓట్లున్నాయి, మద్దతిచ్చే పార్టీల ఓట్ల విలువను బట్టి చూస్తే... గురువారం నాటికి ఎవరి బలమెంతంటే...

ఎన్డీయే బలం...

==================================

పార్టీ                      ఓట్ల విలువ            ఓట్లశాతం

==================================

బీజేపీ                   4,42,117             40.03

––––––––––––––––––––––––––––––––––

టీడీపీ                      31,116              2.82

––––––––––––––––––––––––––––––––––

శివసేన                    25,893              2.34

––––––––––––––––––––––––––––––––––

అకాలీదళ్‌                  6,696               0.61

–––––––––––––––––––––––––––––––––

ఇతర చిన్నపార్టీలు      31,861               2.84

=================================

మొత్తం                5,37,683                48.64

=================================

 


బీజేపీ– కాంగ్రెస్‌లు రెండింటికీ సమదూరం పాటించే తటస్థ పార్టీల్లో... వైఎస్సార్‌సీపీ (16,848 ఓట్ల విలువ– 1.53 ఓట్లశాతం), టీఆర్‌ఎస్‌ (22,048– 1.99), బీజేడీ (32,892– 2.98), అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు (59,224– 5.36) ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతని ప్రకటించాయి. తాజాగా బుధవారం బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తమ పార్టీ జేడీయూ మద్దతు కోవింద్‌కు ఉంటుందని ప్రకటించారు. జేడీయూకు 1.89 శాతం ఓట్లున్నాయి(ఓట్ల విలువ 20,935). ఎన్డీయే బలానికి వీరి ఓట్లు కూడా తోడైతే కోవింద్‌కు  ప్రస్తుతం ఎలక్టోరల్‌ కాలేజీలో ఉన్న బలం 62.39 శాతం. విజయానికి 5,49,452 ఓట్లు వస్తే చాలు. అయితే ఇప్పుడు కోవింద్‌కు అనుకూల ఓట్లు 6,89,630 కావడం గమనార్హం. దీనిని బట్టి విపక్షపార్టీలు మొక్కుబడిగా పోటీకి దిగుతున్నాయనేది స్పష్టమవుతోంది.

 


విపక్ష ఉమ్మడి అభ్యర్థి బలం

====================================

పార్టీ                     ఓట్ల విలువ                  ఓట్లశాతం

కాంగ్రెస్‌                1,61,478                     14.62

––––––––––––––––––––––––––––––––––––

తృణమూల్‌              63,847                     5.78

––––––––––––––––––––––––––––––––––––

సమాజ్‌వాది            26,060                      2.36

––––––––––––––––––––––––––––––––––––

సీపీఎం                  27,069                      2.45

––––––––––––––––––––––––––––––––––––

బీఎస్పీ                    8,200                      0.74

––––––––––––––––––––––––––––––––––––

ఆర్జేడీ                    18,796                      1.7

––––––––––––––––––––––––––––––––––––

డీఎంకే                   18.352                      1.66

––––––––––––––––––––––––––––––––––––

ఎన్‌సీపీ                   15,857                     1.44

––––––––––––––––––––––––––––––––––––

ఇతర చిన్నపార్టీలు      31,145                    2.83

====================================

మొత్తం                3,70,804                   33.58

====================================

► యూపీఏ అభ్యర్థికి 3,70,804 అనుకూల ఓట్లున్నాయి. ఎలక్టోరల్‌ కాలేజీలో 33.58 శాతం మద్దతు ఉందన్నమాట.

► ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఆప్‌ (0.82 ఓట్ల శాతం), ఐఎన్‌ఎల్‌డీ (0.38), స్వతంత్రులు, ఇతర చిన్నాచితక పార్టీలు ఏ వైఖరి తీసుకున్నా అంతిమఫలితంపై ప్రభావమేమీ ఉండదు. – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top