వాడి ఇంటర్వ్యూకు అనుమతి ఎలా ఇచ్చారు?


న్యూఢిల్లీ:   నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు ముఖేష్ కుమార్ ఇంటర్వ్యూ ఉదంతం  కలకలం రేపుతోంది.  మార్చి 8 సందర్భంగా బీబీసి కి  ఇంటర్య్వూఇచ్చాడని చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేసిన సంగతి తెలిసిందే.  ఆ ఇంటర్వ్యూలో అత్యాచారాలకు అమ్మాయిలదే ప్రధాన బాధ్యత అంటూ  ముఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.   దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి . జైలు శిక్షవేసినా నిర్భయ  దోషి మనస్తత్వంలో మార్పురాలేదనీ...అసలు జైల్లో ఉన్నదోషిని ఇంటర్య్వూ చేయడానికి ఎలా అనుమతిచ్చారంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా   విమర్శలు వెల్లువెత్తడంతో హోం శాఖ రంగంలోకి దిగింది.

హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీహార్ జైలు అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. ఏ  పరిస్థితుల్లో అతని ఇంటర్య్వూకు అనుమతిచ్చారంటూ జైలు డీజీని  ప్రశ్నించారు.


మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిపై విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు. భారతదేశంలోని చట్టాల్లోని లోపాల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిర్భయ తల్లి  ఆరోపించారు.  అమ్మాయిలకు రక్షణ ఎక్కడుందని  ఆవేదన వ్యక్తం చేశారు.  నిర్భయ  తండ్రి కూడా ఈ సంఘటనపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు మహిళల   స్వేచ్ఛను వ్యతిరేకిస్తారని, అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్కడికైనా వెళ్లే హక్కు, పనిచేసుకునే హక్కు ఆడపిల్లలకు ఉందని చెప్పారు.

ఇది ఇలా వుంటే  డాక్యుమెంటరీ తీసిన వ్యక్తి నిబంధనలను వ్యతిరేకించారని,  ఈ ఇంటర్యూ బైటపెట్టే ముందు  సంబంధిత వీడియోను తమకు చూపించలేదన్న తీహార్ జైలు అధికారులు  ఆరోపణలను  హోంమంత్రిత్వశాఖ  పరిశీలిస్తున్నట్టు సమాచారం.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top